వారఫలాలు : 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్ 2016 వరకు | vaara phalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్ 2016 వరకు

Published Sun, Oct 30 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

వారఫలాలు :  30 అక్టోబర్ నుంచి 5 నవంబర్ 2016 వరకు

వారఫలాలు : 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్ 2016 వరకు

 మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు. బంధువులతో విభేదాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. ఎరుపు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
 అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో తగాదాలు పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. పాతమిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు మరిన్ని బాధ్యతలు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. పసుపు, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహన సౌఖ్యం. కుటుంబంలో సుఖశాంతులలలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు గౌరవ పురస్కారాలు. ఆకుపచ్చ, నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగవు. విరామం దొరకని పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు. బంధువులతో లేనిపోని వివాదాలు. భూసంబంధిత వ్యవహారాలలో చికాకులు ఎదురవుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. నేరేడు, ఆరెంజ్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 ఎంతగా శ్రమించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలలో కొద్దిపాటి అవాంతరాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పనిఒత్తిడులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. గులాబీ, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

 పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరపు బంధువుల కలయిక. రాబడి తగ్గి అప్పులు చేయాల్సివస్తుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకోని బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహవంతంగా ఉంటుంది. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు. నీలం, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక సంఘటన లేదా సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు నిరాశ తప్పదు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగుపడుతుంది. చిరకాలంగా అనుకుంటున్న కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. పసుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

 సోదరులు,సోదరీలతో విభేదాలు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్య,ఉద్యోగావకాశాలు పొందుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. ఇంటినిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. అందరిలోనూ మంచి గుర్తింపు రాగలదు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారులకు పురస్కారాలు. నీలం,నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

 ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగి ఊరట చెందుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధుమిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. విద్యార్థులకు ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాల కృషి అంతగా ఫలించదు. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రం పఠించండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement