వారఫలాలు : 6 నవంబర్ నుంచి 12 నవంబర్ 2016 వరకు | vaara phalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 6 నవంబర్ నుంచి 12 నవంబర్ 2016 వరకు

Published Sat, Nov 5 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

వారఫలాలు : 6 నవంబర్ నుంచి 12 నవంబర్ 2016 వరకు

వారఫలాలు : 6 నవంబర్ నుంచి 12 నవంబర్ 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాగలదు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అధికలాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
 కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. వాహనయోగం. రావలసిన సొమ్ము అందే అవకాశం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్ప ఆటంకాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. కళాకారులకు నిరుత్సాహం. ఎరుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 కొన్ని పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.  ఇంటి నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. తెలుపు, బంగారు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగులు కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. గులాబీ, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పసుపు, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళం. సన్నిహితులతో విభేదాలు. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళాకారులకు నిరుత్సాహం. నలుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఖర్చులు అధికం. పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య భంగం. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణయత్నాలలో ఆటంకాలు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. బంగారు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 అనుకున్న ఆదాయం రాక రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడులు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహణ. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు నిరాశ తప్పకపోవచ్చు. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సాగిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి. ఉద్యోగులకు కొన్ని మార్పులు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. నలుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. రావలసిన సొమ్ము అందుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. గులాబీ, బంగారురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement