వారఫలాలు : 23 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివనామస్మరణ మంచిది.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఇంటి పరిస్థితులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు అవకాశాలు తృటిలో తప్పిపోయే సూచనలు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు. కళాకారులకు నిరాశ. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రాబడి తగ్గి రుణాలు చేస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువర్గంతో అకారణంగా విరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండటం క్షేమం. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు అనుకున్న రీతిలో ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు మీకు అండదండగా నిలుస్తారు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వ్యవ హారాలలో ఆటంకాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యం మందగించే సూచనలు. నిరుద్యోగులు, విద్యార్థుల కృషి కొంత వరకు ఫలిస్తుంది. మిత్రుల సలహాలు, సహాయం స్వీకరిస్తారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు అవకాశాలు చేజారవచ్చు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదత్త స్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త మిత్రులు పరిచయమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు చకచకా పూర్తి కాగలవు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. నలుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. మీ ఊహలు నిజమవుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. గులాబీ, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలయ దర్శనాలు. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. గృహ నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు గందరగోళ పరిస్థితి. నీలం, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నలుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అనుకున్న ఆదాయం పొందుతారు. ముఖ్య నిర్ణయాలకు అనుకూల సమయం. వాహన, గృహయోగ అవకాశాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒక కీలక సమాచారం అందుతుంది. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. నేరేడు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.