వారఫలాలు : 16 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ 2016 వరకు | vaara phalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 16 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ 2016 వరకు

Published Sun, Oct 16 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

వారఫలాలు : 16 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ 2016 వరకు

వారఫలాలు : 16 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.  పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడుదొడుకులు తొలగుతాయి. పసుపు, చాక్లెట్‌రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం  పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
 చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. విద్యార్థుల యత్నాలు కొంత అనుకూలిస్తాయి. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సోదరుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఎరుపు, లేత నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయం కొంత పెరిగే అవకాశం. నూతన విద్యావకాశాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరతాయి.  వ్యాపారాలు అభివృద్ధి ్ధపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. రాజకీయవేత్తలకు పదవీయోగం. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. అదనపు ఆదాయం లభిస్తుంది. సన్నిహితులు సహ కరిస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు. పసుపు, లేత  ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 కొన్ని వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు. స్నేహితుల నుంచి శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు. కళాకారులకు కొంతవరకూ అనుకూల సమయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 నేర్పుగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారమవు తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతనోత్సాహం, ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు ైపైస్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయవేత్తలకు ఆకస్మిక  విదేశీ పర్యటనలు ఉంటాయి. నేరేడు, పసుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సన్నిహితుల సలహాలు పాటిస్తారు. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు, పురస్కారాలు. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం కొంత తగ్గి రుణాలు చేస్తారు. సన్నిహితులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత వరకూ పరిష్కారం. వ్యాపారాలలో స్వల్పలాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం ఉన్నా తగిన గుర్తింపు తథ్యం. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.  ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. కాంట్రాక్టులు పొందుతారు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 పనులలో ఆటంకాలు. రాబడికి మించిన ఖర్చులు. విద్యార్థుల కృషి ఫలించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు, స్నేహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.  శ్రమ తప్ప ఫలితం కనిపించదు.  వ్యాపారాలలో  కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. నలుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కవచ్చు. కళాకారులకు సన్మానాలు. గులాబీ, లేత పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తిస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement