వారఫలాలు : 21 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి, 2016 వరకు | vara Phalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 21 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి, 2016 వరకు

Published Sun, Feb 21 2016 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

వారఫలాలు : 21 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి, 2016 వరకు

వారఫలాలు : 21 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు సఫలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. పసుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకుని పూజించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
గతాన్ని తలచుకుంటూ గడుపుతారు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వివాదాలు సర్దుబాటు కాగలవు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వాహనయోగం. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులు ఒక సమాచారంతో ఊరట చెందుతారు. లేత ఆకుపచ్చ, ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు. ఆలోచనలు కలసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగల అవకాశం. కళాకారులకు అవార్డులు. బంగారు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. మీ శ్రమ ఫలిస్తుంది. ఒక వివాదాన్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని విధంగా పదవులు. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అదనపు ఆదాయం సమకూరుతుంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
తుల: (చిత్త 3,4,స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, గృహం కొనుగోలు. వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు.  రాజకీయ వర్గాలకు పదవీయోగం. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు. కళాకారులు ఒత్తిళ్ల నుంచి బయట పడతారు. గులాబి, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
చికాకులు, ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.  చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. విలువైన వస్తువుల కొనుగోలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఊపిరి పీల్చుకునే సమయం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. పనులు వేగం పుంజుకుంటాయి. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయ వర్గాలకు పదవులు లభిస్తాయి. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 కొత్తపనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. పెద్దలు, ప్రముఖుల సలహాలతో ముందడుగు. ఆస్తి లాభ సూచనలు. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువుల కలయిక. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కార్యక్రమాలు సకాలంలోనే పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అదనపు ఆదాయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూ వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు గౌరవ పురస్కారాలు. గోధుమ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 - సింహంభట్ల సుబ్బారావు
 జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement