దశాబ్దాలు పనిచేసి రిటై రైన వారికి నెలనెలా పింఛ ను ఇవ్వాలని పీఎఫ్ చట్టం 1952, పింఛను పథకం 1995 స్పష్టంగా నిర్దేశి స్తున్నాయి. కానీ విరమణ చేసి చాలా ఏళ్లు గడచినా పెన్షన్ దక్కని బెనర్జీ అనే వృద్ధుడి పక్షాన ప్రవీణ్ కోహ్లీ అనే వ్యక్తి పోరాటం జరిపాడు. వినియో గదారుల కమిషన్ బెనర్జీకి అనుకూల తీర్పుఇచ్చినా పింఛను ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి? అంటూ కోహ్లీ కొన్ని ప్రశ్న లు వేశాడు. పీఎఫ్ ఆఫీస్ నిష్క్రియ వల్ల బెనర్జీ కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నది. తన మిత్రుడు బెనర్జీ తరఫున కోహ్లీ వేసిన ఆర్టీఐ దరఖాస్తుతో పని జరిగింది. కోల్‌కతాలో అనారోగ్యంతో ఉన్న ఉద్యోగి కోసం గుర్‌గావ్ నుంచి అతని మిత్రుడు ఆర్టీఐ దర ఖాస్తుపెడితే, ఢిల్లీ దగ్గరి గుర్‌గావ్ నుంచి కోల్‌కతా వచ్చి దస్త్రాలు చూసుకుని ప్రతులు తీసు కోవాల న్నారు. దీంతో రెండో అప్పీలులో కోహ్లీ తన మిత్రు డు కష్టాలు ఏకరువు పెట్టారు.
1969లో సర్వీసులో చేరి 58 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేసిన బెనర్జీకి నెల పింఛనుకు అర్హుడు. కానీ ఇవ్వలేదు. కోల్‌కతా జిల్లా వినియో గదారుల ఫోరంలో కేసు ఓడిపోయాడు. రాష్ట్ర కమిష న్ బెనర్జీకి పింఛను అర్హత ఉందని వెంటనే చెల్లిం చాలని ఆదేశించింది. విరామం లేకుండా 33 ఏళ్ల 7 నెలలు పనిచేసిన బెనర్జీకి పింఛను ఆపాల్సిన కారణ మే లేదని, పింఛను పథకం కింద మూడునెలల్లో ఆయన పింఛను లెక్కించి 2002 సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగ విరమణ చేసిన నాటి నుంచి పింఛను ఇవ్వాలని ఆదేశించింది. 26వేల 400 రూపాయలు తప్ప మరే ఇతరమైన తగ్గింపులు చేయరాదని, నెల రోజుల్లోగా బెనర్జీకిS పింఛను బకాయిలన్నీ చెల్లిం చాలని, అన్యాయంగా పింఛను ఇవ్వనందుకు జరి మానాగా 12 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర కమిషన్ ఆదేశించింది. కానీ, ఏదో అన్యాయం జరిగినట్టు కోల్‌కతా ఈపీఎఫ్ జాతీయ వినియోగదారుల కమి షన్ కు అప్పీలు చేుసింది.
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఉత్తర్వును ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ హుందాగా గౌరవించాల్సింది. కానీ అన్యాయంగా జాతీయ ఫోరం దాకా లాగడం న్యాయం కాదు. పీఎఫ్ సంస్థ ఈ ఉద్యోగికి ఇచ్చే స్వల్ప పింఛను కన్నా చాలా ఎక్కువ డబ్బు ఖర్చుచేసి ఈ అప్పీలు వేసి ఉంటుందని జాతీయ వినియోగదారుల కమిషన్ వ్యాఖ్యానించింది. ఇంత జరిగాక కూడా ఆ పేద కార్మికుడిపై ఈపీఎఫ్ పగ బట్టినట్టు సుప్రీంకోర్టులో జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పుచెల్లదని దుర్మార్గంగా అప్పీలు దాఖలు చేసింది. తరువాత ఎవరో పుణ్యాత్ముడైన అధికారి ఆదేశాల మేరకు ఈ అప్పీలును ఉపసంహరించుకుంది. ఇప్పుడైనా పింఛను ఇస్తారేమో అనుకుంటే బెనర్జీకి నిరాశే ఎదు రయింది. తీర్పు అమలు చేయలేదు. కేవలం ఒక నెల వేయి రూపాయల పింఛను ఇచ్చి, ‘‘ఇంతే. నీకేమీ రాదు. నీ పింఛనుసొమ్మంతా సంస్థ స్వాధీనం చేసు కుంది,’’ అని ఈపీఎఫ్ నిర్దయగా ఉత్తర్వులు జారీ చేసింది.
బెనర్జీ పింఛను నిరాకరణ కథ ప్రభుత్వ హింస, సర్కారీ క్రూరత్వానికి ఒక ఉదాహరణ. జాతీ య వినియోగదారుల కమిషన్ తీర్పును కూడా అమ లు చేయకపోవడం అన్యాయం అని అతను మొర బెటు ్టకుంటే వినేవాడు లేడు. ప్రధానమంత్రికి, కేంద్ర కార్మి క శాఖ కార్యదర్శికి విన్నపాలు పెట్టుకున్నారు. కానీ ఎవ్వరికీ దయ రాలేదు. కనీసం పీఎఫ్ ఛీఫ్ కమిషనర్ అయినా వినిపించుకుంటారేమో అనుకు న్నారు. కానీ ఆయనకు కూడా తీరిక లేదు. ఆ దశలో ఆర్టీఐ దరఖాస్తు వేస్తే అది కూడా దున్నపోతుమీద వానే అయింది. జితేంద్ర కుమార్ శ్రీవాత్సవ్ అనే సామాన్య ఉద్యోగికి జార్ఖండ్ ప్రభుత్వం పింఛను నిరాకరించడమేగాక, ఈ విషయమై ఈ విధంగానే సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఉద్యోగ విరమణ చేసిన సామాన్య పౌరుడిపై పోరాడింది.
పింఛను, గ్రాట్యుటీ అనేవి ఉద్యోగులకు ఇచ్చే బహుమతులు కావు. అది వారి రాజ్యాంగ హక్కు (300 ఏ). వారి ఆస్తి. ప్రభుత్వం వాటిని అకారణంగా స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. పైగా పింఛను, గ్రాట్యుటీ మొత్తాలను నిలిపివేసి, స్వాధీనం చేసుకునే అధికా రాన్ని ప్రభుత్వానికి ఏ చట్టమూ ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఉద్యోగుల పింఛను పథకం –1995 ప్రకారం ఉద్యోగుల యజ మానులు లేదా సంస్థలు తమ వంతు పీఎఫ్ వాటాను చెల్లించకపోతే ఆ సంస్థల నుంచి జరిమా నా, నష్టపరిహారాలను వసూలు చేయాలని పన్నెండో నియమం అధికారాన్ని ఇస్తున్నది. మొత్తం దస్తావే జుల ప్రతులు బెనర్జీకి ఇవ్వాలని, నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూ డదోచెప్పాలని, కార్మికుడిని వేధిం చినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. (ప్రవీణ్ కోహ్లీ వర్సెస్ ఇపీఎఫ్‌ఓ కొల్‌కత్తా ఇఐఇ/ఉ్కఊౖఎ/అ/2018/153919 కేసులో 28.9.2018 నాటి ఆదేశం ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment