రక్తికట్టని ‘అవిశ్వాస’ నాటకం | Review On No Confidence Motion By ABK Prasad In Sakshi | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 24 2018 2:25 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

Review On No Confidence Motion By ABK Prasad In Sakshi

నిజానికి చంద్రబాబు లోక్‌సభలో ప్రవేశపెట్టించింది ‘విశ్వాస’ ప్రకటనేగాని ‘అవిశ్వాస’ తీర్మానం కాదని మెడమీద తలలున్న ప్రతి ఒక్కరికీ తెలుసు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన వల్ల ఏపీ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ మోసం చేసింది. బీజేపీ సైతం కాంగ్రెస్‌ బాటలో పయనించింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, దానితో సరిపెట్టుకోవాలని చంద్రబాబు అప్పట్లో సరేనన్నారు. ‘దొరారి అభిప్రాయమే నా అభిప్రాయం’ అనే రీతిలో ఆయన సరిపెట్టుకుని రకరకాల వంకలూ, డొంకలూ పట్టుకుని తిరుగుతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయంలో భాగంగానే బీజేపీ సర్కారుపై ఎదురుదాడి చేసినట్టు ఆయన కొత్త నాటకం మొదలెట్టారు.

(గత వారం జమిలి ఎన్ని కలపై కుదేలైన బీజేపీ భ్రమలు వ్యాసానికి కొనసాగింపే ఈ గ్రంథ సమీక్షా వ్యాసం. గత నాలుగేళ్ల ఎన్డీఏ పాలనలో ఫెడరల్‌ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఘటిల్లిన పరిణామాలను సమీక్షిస్తూ మీడియా హౌస్‌ ప్రచురించిన బృహత్‌ గ్రంథం ‘‘డిస్ట్రాయింగ్‌ ఇండి యా’’ను ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఇటీవల ఆవి ష్కరించారు. మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వాస్తవానికి ‘విశ్వాస ప్రకటన’ మాత్రమే. ఈ పూర్వరం గంలో ఈ పుస్తకంపై సమీక్షా రచన ఇది.)


2014 పార్లమెంటు ఎన్నికల్లో దేశప్రజలు బీజేపీకి అనుకూలంగా ఇచ్చిన తీర్పును దేశంలోని ప్రతిపక్షాలు బేఖాతరు చేస్తున్నాయి. నాకు వ్యతిరేకంగా ఎన్ని ప్రతి పక్షాలు ఏకమైనా ఆ మేరకు బీజేపీ ‘కమలం’ వికసి స్తూనే ఉంటుంది. నేను అవినీతిని, ఆశ్రితపక్షపాతాన్ని ఎదుర్కొంటున్నందునే బీజేపీ సంకీర్ణానికి వ్యతిరే కంగా ప్రతిపక్షాలు ఐక్యం కాలేకపోతున్నాయి. ఈ పరి స్థితుల్లో కాంగ్రెస్‌ కేంద్రంగా ఐక్యసంఘటన ఏర్పడడం ఏపీ సీఎం చంద్రబాబుకు ఇష్టంలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయడానికి ఆ ప్రభు త్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయినా ప్రజలు నాపైన విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రతిపక్షాల ప్రయత్నం వృధా అయింది.
– అవిశ్వాస తీర్మానం వీగిపోయిన మరుసటి రోజు యూపీలోని సహారన్‌పూర్‌ సభలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

నిజానికి తెలుగుదేశం నేత చంద్రబాబు లోక్‌సభలో ప్రవేశపెట్టించింది ‘విశ్వాస’ ప్రకటనేగాని ‘అవిశ్వాస’ తీర్మానం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు! ఎన్డీఏ సర్కా రుకు ఏ రూపంలోనూ మద్దతు తెలపకుండా ఏపీలో బలమైన  ప్రతిపక్ష నేతగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్య క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శరవేగాన ముందుకు దూసుకు వస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ పాలనలో జగన్‌పై బనాయించిన కేసులను బీజేపీ హయాంలోనూ తేల్చకుండా సాగదీస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ బాబు  మాటే ఈ విషయంలో చెలామణి అవుతున్నట్టు కనిపిస్తోంది. చివరికి, సీబీఐ ప్రత్యేక కోర్టులు సైతం, ‘మీ ఆరోపణలకు, కేసుల విచారణకు ఆదీ, అంతాలు లేకుండా పోయిన సాక్ష్యా లకు ముగింపు ఎప్పుడు?’ అని సీబీఐని ప్రశ్నిం చాల్సి వచ్చింది. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను జగన్‌ బహిర్గతం చేయడమే ఈ పార్టీలను ఏకం చేస్తోంది.

ఈ రెండు పార్టీల కుట్ర ఫలితంగానే కాంగ్రెస్‌ నుంచి జగన్‌ బయటికొచ్చి ప్రభంజనమై అవతరించారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం సహించలేక పోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు ముందుకు సాగకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. మరో వైపు అలాంటి కేసులే తనపై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చినా ఆయన అన్యమార్గాల ద్వారా తప్పించుకుంటు న్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన వల్ల ఏపీ ప్రజల భవి ష్యత్తు దృష్ట్యా ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ మోసం చేసింది. బీజేపీ సైతం కాంగ్రెస్‌ బాటలో పయనించింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, దానితో సరిపెట్టుకోవాలని అంటే చంద్రబాబు అప్పట్లో సరేనన్నారు. ‘దొరారి అభిప్రా యమే నా అభిప్రాయం’ అనే రీతిలో రకరకాల వంకలూ, డొంకలూ పట్టుకుని తిరుగుతున్నారు.

ఈ కుమ్మక్కు రాజకీయంలో భాగంగానే బీజేపీ సర్కా రుపై ఎదురుదాడి చేసినట్టు ఆయన కొత్త నాటకం మొదలెట్టారు. అందుకు ప్రతిగా, ‘బాబు కోరిందే (ప్యాకేజీ) ఇవ్వడానికి మేం అంగీకరించాం,’ అని మోదీ చెప్పారు. ఎన్డీఏ సర్కారు నుంచి బయటి   కొచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వ కమిటీల్లో తెలుగు దేశం ప్రాతినిధ్యం కొనసాగుతోంది. ‘మాతో చంద్ర బాబు స్నేహం అలాగే ఉంది. ఇంకా కొనసాగు తుంది’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించడం బీజేపీ, టీడీపీ మధ్య ఓ కొత్త మ్యాచ్‌ ఫిక్సింగ్‌ క్రీడగా మారింది.


భ్రష్టుపట్టించిన బీజేపీ పాలనపై కొత్త పుస్తకం!
సరిగ్గా ఈ వాతావరణం మధ్యనే గత నాలుగేళ్ల పాలనా కాలంలో జరిగిన ప్రజావ్యతిరేక, విషాదకర పరిణామాలను ఏకరువు పెడుతూ ‘భారతదేశాన్ని భ్రష్టుపట్టించిన నాలుగేళ్ల బీజేపీ పాలన’ అనే మకు టంతో దిల్లీకి చెందిన మీడియా హౌస్‌ సంస్థ ప్రచు రించిన పుస్తకాన్ని ‘మోదీ రిపోర్ట్‌కార్డ్‌ డాట్‌కామ్‌’ అనే వెబ్‌సైట్‌లో ఓ రిపోర్ట్‌గా వెల్లడించింది. నేడు దేశంలో మత ప్రాతిపదికపై సాగుతున్న అరాచకాలు, హత్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, పెట్రోలు, డీజిల్‌ ధరలు, ఇంకా పెద్ద నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు, రైతులు సహా సాధారణ ప్రజలు పడిన పాట్లు వంటి అనేక సమస్యలపై ‘డిస్మాంట్లింగ్‌ ఇండియా ఇన్‌ ఫోర్‌ ఇయర్స్‌’ అనే ఈ పుస్తకంలో వివరించారు. ఈ గ్రంథ రచనలో పాతిక మందికి పైగా ప్రసిద్ధ పరిశోధకులు, చరిత్రకారులు, ఆర్థిక వేత్తలు, జర్నలిస్టులు సహా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు పాల్గొన్నారు.

మోదీ రిపోర్ట్‌ కార్డ్‌ (2018) లోని కొన్ని అంశాలు క్లుప్తంగా ఇక్కడ ప్రస్తావిస్తు న్నాను. దేశంలో 2014లో 3.41 శాతం ఉన్న నిరు ద్యోగం 2018కి 6.23 శాతానికి పెరిగింది. నాలు గేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలన్న హామీ 2017దాకా 8.23 లక్షలకే పరిమితమైంది. పెట్రోల్, డీజిల్‌ ధరలు 2018లో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.68.86 ఉండగా, తర్వాత క్రూడాయిల్‌ ధర తగ్గినాగాని 2018 కల్లా రూ.81. 92కి చేరింది. నోట్ల రద్దు ఫలితంగా 2017 జన వరి–ఏప్రిల్‌ మధ్య 15 లక్షల ఉద్యోగాలు పోయాయి. పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్లకైన ఖర్చు ఫలితంగా దేశ స్థూల జాతీయోత్పత్తుల విలువ 7.93 నుంచి 6.50 శాతానికి పడిపోయింది. అవినీతి విషయానికి వస్తే, బ్యాంకుల మోసాల సంఖ్య రూ. 12,787 నుంచి అదే కాలంలో రూ. 17,789 కోట్లకు చేరింది. అదే సమ యంలో ఇండియాను మొత్తం ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా అమెరికాకు చెందిన ఫోర్బ్స్‌ సంస్థ ప్రకటించింది. ఎన్నో రాష్ట్రాల్లో అవినీతిపై విచారణకు అవసరమైన లోక్‌పాల్‌ను ఇంతవరకు నియమించ లేదు. 

దళితులపై ఎన్నో రెట్లు పెరిగిన దాడులు
దళితులపై దేశవ్యాప్తంగా జరిగిన దాడులకు సంబం ధించి 2008లో 33 వేల కేసులు నమోదుకాగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 746 శాతం, గత పదేళ్లలో 1,160 శాతం పెరిగిపోయాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకటించింది. ఇక రైతాంగ సంక్షోభం వల్ల వ్యవసాయరంగ అభివృద్ధి రేటు 2010–2014 మధ్య 5.2 శాతం నమోదు కాగా 2014–18 మధ్య అది 2.4 శాతానికి దిగజారిపో యింది. 2014–2016 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులు 36,420 మంది కాగా, 2017–18 మధ్య అంచనాలు ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది. గత నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం మూసేసిన ప్రభుత్వ పాఠశాలలు 2 లక్షలు. పాఠశాల పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పాఠాల్ని, చరిత్రను తిరిగి రాసే పనికి శ్రీకారం చుట్టారు. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల మెరుగుదల విషయంలోను, పరిస్థితి లోనూ మార్పేమీ లేదు. ఇక మోదీ హయాంలో దేశ న్యాయ వ్యవస్థ నిర్వహణలో భారీ సంక్షోభం నెల కొంది. ఎన్‌కౌంటర్‌ మరణాల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రపై విచారణ జరుపుతున్న క్రమంలో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీహెచ్‌ లోయా ఆకస్మిక మరణంపై విచారణ ఆకస్మికంగా నిలిచిపో యింది. చివరికి ఈ పరిణామం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాను పార్లమెంట్‌ అభిశం సించాలన్న డిమాండ్‌కు దారితీసింది. ఆధార్‌ కార్డు ఉనికి కాస్తా జాతీయ స్థాయిలో చర్చకు, అభిశంస నకూ పాత్రమైంది. ఈ నాలుగేళ్లలోనూ దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఇతర సంక్షేమ వ్యవస్థల నిర్వహ ణకు నిధులు తరిగిపోయాయి. 

ప్రజల సంక్షేమంపై ఏదీ శ్రద్ధ?
గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు తగ్గిపోయాయి లేదా పక్కదారులు పట్టాయని రిపోర్టు కార్డు వివరించింది. ఆరోగ్య సంరక్షణ విష యంలో ఇరుగుపొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌లతో పోల్చితే ఇండియా స్థానం ఈ నాలుగేళ్లలోనే 195 దేశాల్లో 145వ స్థానానికి పడి పోయింది. మోదీ ప్రారంభించి, ఆచరణలో అసలు అమలు కాకుండా ఉన్న పెక్కు పథకాలు కాంగ్రెస్‌ ప్రారంభించినవే కాగా, వాటికే కేవలం పేర్లు మార్చ డమే జరిగిందని రిపోర్ట్‌ కార్డు వివరించింది. పర్యా వరణ రక్షణ పథకాల అమలులోనూ ప్రపంచంలోని 180 దేశాల్లో మనం 177వ అథమ స్థానంలోకి ఈ నాలుగేళ్లలోనే చేరుకున్నాం. అలాగే గత నాలుగేళ్ల లోనే దేశంలో జరిగిన మత ఘర్షణలు 2020. అందులో (2014 నుంచి 2018 దాకా) హతులైన వారి సంఖ్య 389 కాగా, గాయ పడినవారు 8,890 మంది. ఇవన్నీ ఈ నాలుగేళ్లలోనే ఏడు రాష్ట్రాలకు వ్యాపించాయి.

అంతేగాదు, ఈ నాలుగేళ్లలోనే బీజేపీ హయాంలో జరిగిన మత ఘర్షణల్లో, విద్వేష ప్రచార ఘట్టాలలో జరిగిన వేధింపులు, హత్యాకాండ నేరా లకు సంబంధించిన కేసుల్లో శిక్షలు పడిన పార్టీ నేర గాళ్లకు మద్దతుగా పరామర్శించడానికి వెళ్లినందుకు బీజేపీ మంత్రి జయంత్‌ సిన్హాను కేబినెట్‌ నుంచి తొలగించాలని కోరుతూ పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మందికి పైగా మాజీ సివిల్‌ సర్వెంట్స్‌ (ఐఏఎస్‌/ఐపీఎస్‌/దౌత్యాధికారులు/ప్రధాన కార్యద ర్శులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది చివరి మాసాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్ని కల్లో హిందువులను భయ భ్రాంతుల్ని చేసే అనేక పద్ధతుల్లో అబద్ధపు వార్తలతో ‘నకిలీ వార్తల కర్మా గారం’ (ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీ) నడుస్తోందని కూడా వార్తలు పొక్కుతున్నట్టు కూడా ‘వైర్‌’ లాంటి మాధ్య మాలు హెచ్చరిస్తున్నాయి. ఏది ఏమైనా అటు పాల కులు, ఇటు ప్రసార మాధ్యమాలు, రాజకీయ పక్షాలు, వాటి అనుయాయులూ జాగరూకులై ఉండా లన్నది మాధ్యమాల ఆరోగ్యకరమైన సందేశం!


- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@ahoo.co.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement