ఈ లాక్‌డౌన్ తన లక్ష్యాలను సాధిస్తుందో లేదో తెలీదు. ఫలితం ఎలా వచ్చినా, మనం ప్రవర్తించిన తీరు భారతీయుడిగా నన్ను గర్వ పడేలా చేస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,637 మార్కు దాటింది. దీనర్థం ఈ ఉప ద్రవాన్ని దాటేశామనా, నిపుణులు చెబుతున్నట్టు ఇదంతా తుఫాను ముందటి నిశ్శబ్దమేనా? ఇట్లా జరుగుతుందని నమ్మలేని విధంగా ప్రపం చాన్ని మార్చేసిన ఈ అంటువ్యాధి గురించి మూడు వారాలుగా పరస్పర విరుద్ధమైన వాదనలు వింటూ, ఉత్సాహపూరిత పండితులు అవ్వడం మానేశాం. ప్రపంచంలోని ప్రతి మూలకూ ఇది సోకగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీన్ని చైనీస్ వైరస్ అని పిలవడా నికి ఉత్సాహపడినట్టే, ప్రతి ఒక్కరికీ దీని కోసంఏం చేయాలో, ఏం చేయకూడదో వారిదైన అభిప్రాయం ఉన్నట్టు అనిపించింది. కానీ అన్నీ తెలిసినట్లు మాట్లాడే ఆ పెద్ద గొంతులు క్రమంగా మూగ బోతున్నాయి.
శాసనబద్ధులైన పౌరులుగా ఎంతో మంది భార తీయులు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఏప్రిల్ 15 తర్వాతైనా మళ్లీ రోజువారీ దినచర్యలోకి కుదు రుకోగలం అన్న ఆశతో. ఇట్లాంటి సందర్భాల్లో మన తరఫున నిర్ణయం తీసుకునే భారాన్ని ఒక పెద్ద శక్తికి బదిలీ చేయకుండా ఉండలేం. ఉదాహరణకు ఎన్నో రూపాల్లో ఉన్న దేవుడు. ఈ వ్యాకులత క్షణాల్లో మన నమ్మకాన్ని ప్రభుత్వం మీద కూడా ఉంచుతాం. ఈ విశ్వాసం గుడ్డిది కాకపోయినా, దానికి ఉన్న సమా చారం, వనరుల లభ్యత వలన ప్రభుత్వమే మన తరఫున ఆలోచించి, మన కోసం నిర్ణయం తీసుకోవా లని అనుకుంటాం.
ఆధునిక చరిత్రలో కొన్ని సందర్భాల్లో పూర్తిగా ప్రజలు విశ్వాసం కోల్పోవడమో, లేక ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా నడవడమో జరిగిన ఉదంతాలు ఉన్నాయి. 1940 వసంతంలో ఫ్రాన్స్ లోని దుర్భేద్యమైన మేజినెట్ రేఖను జర్మన్ సైన్యం ఆక్రమించిన సంఘటనను నేను ఉదహరిస్తూ ఉంటాను. అత్యంత శక్తిమంతమైన ఫ్రెంచ్ రాజ్యంలో అధికార వర్గం కుప్పకూలి, సామాజిక అస్తవ్యస్తత నెలకొంది. ఈ హఠాత్పరిణామం ఫ్రెంచ్ వాళ్లను జర్మన్లతో కలిసి నడిచేట్టూ, మార్షల్ పెటైన్, అతడు నేతృత్వం వహించిన పెళుసైన విచీ ప్రభుత్వంలో నమ్మకం ఉంచేట్టూ చేసింది.
సైన్యం ఓడినంత మాత్రానే సామాజిక అస్త వ్యస్తత చోటుచేసుకోదని చెప్పడం రాజకీయంగా సరైనది కాక పోవచ్చు. కానీ ఒక ఉదాహరణ. 1945 ప్రారంభానికే నాజీ జర్మనీ కుప్పకూలడానికి ఇక ఎన్నో రోజులు పట్టదని స్పష్టంగా అర్థమైంది. అమె రికా, సోవియట్ యూనియన్ ఉమ్మడి సేనలను ఎదుర్కొని నిలబడటం హిట్లర్ ప్రభుత్వానికి ఏం చేసినా సాధ్యం కాదు. అయినా పట్టు వదలక జర్మన్లు తీవ్రంగా పోరాడారు.
ఇక్కడ దృష్టినుంచి తప్పిపోయే ఒక వాస్తవం ఏమిటంటే, 1944 మధ్యనుంచి వరుస సైనిక ఓటములతోనూ, శత్రువుల బాంబు దాడుల్లో ప్రతి నగరం ధ్వంసం అవుతూ కూడా జర్మనీలో సామాజిక అస్తవ్యస్తత నెలకొనలేదు. కానీ ఫ్రాన్స్‌లో జరిగింది వేరు.
ఈ వెలుగులో ఈ రెండు ప్రభుత్వాల అను భవాలను అర్థం చేసుకోవాలి. 1940లో ఫ్రాన్స్ ప్రజా స్వామిక దేశం కాగా, జర్మనీ పూర్తిగా ఏక పార్టీ సైనిక పాలనలో ఉంది. సంక్షోభ సమయాల్లో సమాజాన్ని ఏకీకృతం చేయగలిగిన మెరుగైన రికార్డు సైనిక పాలిత దేశాలకే ఉంది. ప్రస్తుతానికి కరోనా చైనా కుట్ర అనేది విస్మరిస్తే గనక, వూహాన్లో లాక్‌డౌన్ విజయవంతం చేసిన అక్కడి అధికారవర్గాల తీరు మాత్రం ప్రశంసార్హం. పౌరులకు కలిగిన అసౌకర్యా లను అక్కడి స్వేచ్ఛ లేని మీడియా తగ్గించి చూపి ఉండవచ్చు. కానీ ఈ ఉపద్రవం సందర్భంలో అట్లాంటి తీవ్రమైన చర్యలు క్షమార్హం అయినవి.
వూహాన్ నమూనాను అనుసరించడంలో పాశ్చాత్య దేశాలు కోరుకున్న లక్ష్యాలను సాధించలేక పోయాయి. విపరీత ప్రాణనష్టం సంభవించిన ఇటలీ, స్పెయినే కాకుండా ఇతర ప్రజాస్వామిక దేశాలు కూడా లాక్‌డౌన్ విధించడంలో తొట్రు పడ్డాయి. కానీ భారత్ లాంటి భిన్నత్వం కలిగిన పెద్ద దేశంలో విజయవంతంగా లాక్‌డౌన్ చేపట్టడం జరి గింది. నరేంద్ర మోదీ గనుక నాయకత్వ స్థానంలో లేకపోయి ఉంటే, ఆర్థిక నిర్బంధాలు, మనుషుల ఇబ్బందులు అనే కారణాలు చూపి, ఇతర తక్కువ స్థాయి నాయకులు అర్ధ చర్యలు తీసుకునేవారు. ఆర్థిక పర్యవసానాలు ఊహకు అందనంత ఎక్కువగా ఉంటాయి. కానీ ఆర్థికం కంటే మనుషులకు పెద్ద పీట వేసిన ఈ ఒక్క కారణంగా, ఇండియా ఈ సంక్షోభ సమయంలో తలెత్తుకుని నిలబడిందని నమ్మవచ్చు.
స్వపన్ దాస్ గుప్తా
వ్యాసకర్త రాజ్యసభ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment