లండన్: రోజులో ఎనిమిది గంటలపాటు ఆఫీసులో పనిచేసి ఎలాంటి శారీరక వ్యాయామం లేకుండా జీవించడం పొగతాగడంతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 1 మిలియన్ ఉద్యోగుల మీద చేసిన పరిశోధనల్లో ఈ చేదు నిజాలు వెల్లడైనట్లు నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ పరిశోధకులు తెలిపారు. రోజుకు కనీసం 60 నుంచి 75 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం లేదా ఒక గంటపాటు నడక సాధన చేయడం వల్ల ఆఫీసులో కూర్చున్న ఎనిమిది గంటల సమయం నుంచి హీల్ కావొచ్చని తెలిపారు.
ఆఫీసులో ఎనిమిది గంటలు పనిచేసిన తర్వాత మరో ఐదుగంటలపాటు టీవీ వీక్షించడం వల్ల వ్యాయామం కూడా పూడ్చలేని తీరని నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ఇంటివద్ద కానీ, ఆఫీసులో కానీ ఎక్కువ సమయం కూర్చొని ఉండటం వల్ల అనారోగ్యం కలుగుతుందని చెప్పారు. 45 ఏళ్ల వయసు పైబడిన ఉద్యోగుల దినచర్యలను, టీవీ చూసే అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీ లెవల్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రతి రోజూ 60-75 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నవారు జబ్బుపడే అవకాశం తక్కువగా ఉన్నట్లు తేలింది.
ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో కూర్చొని పనిచేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయని దీని వల్ల శారీరక క్రియల్లో తేడాలు వస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ప్రజలు ఆఫీసుకు నడుచుకుంటూ లేదా సైకిల్ పై వెళ్తూ ప్రమాదకర జబ్బుల బారిని పడకుండా వారినివారే రక్షించుకుంటున్నారని తెలిపారు. అలాగని ఎక్కువగా శారీరక శ్రమ చేయడం, జిమ్ కు వెళ్లడం తదితరాల వల్ల కూడా ప్రయోజనంలేదని చెప్పారు.
అలా ఉద్యోగం చేయడం పొగతాగడంతో సమానం!
Published Thu, Jul 28 2016 6:22 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
Advertisement