శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్కు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు.
హుజూర్‌నగర్(నల్గొండ): శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్కు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు..స్నేహితుల వేధింపులు తట్టుకోలేక గామం నాగార్జునరెడ్డి(12) శనివారం ఉదయం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో చిలకల్లువద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
దాదాపు 90 శాతం కాలిన గాయాలతో అరుస్తున్న అతడిని స్థానికులు వెంటనే జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట జడ్జి విద్యార్థి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని విజయవాడకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.