సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని రచయిత పసునూరి రవీందర్ అందుకున్నారు. బుధవారం జరిగిన సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ చేతుల మీదుగా పురస్కారాన్ని, రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందుకున్నారు.
తెలంగాణ దళిత కథల సంకలనం 'ఔట్ ఆఫ్ కవరేజి ఏరియా'కు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు స్వీకరించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితుల నేపథ్యంలో కొందరు సాహిత్య అవార్డులు వెనక్కి ఇచ్చారని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించి లౌకిక ప్రజాస్వామిక విధానాలకు మద్దతివ్వాలన్నారు.