ఆదాయం భేష్: మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆదాయానికి ఎటువంటి ఢోకా లేదని ఆర్థిక మంత్రి ఈటల రా జేందర్ అన్నారు. వార్షిక బడ్డెట్‌లోని అంచనాల మేరకు ఆదాయ వ్యయాలున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ర్ట ఆదా యం మరింత పెరుగుతుందనే నమ్మకముం దని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే తె లంగాణ అగ్రగామిగా వెలుగొందుతోందని, ఖజానా ఖాళీ అయిందని వస్తున్న వార్తలు ఊహాజనితమని స్పష్టం చేశారు. ప్రభుత్వాని కి ఆదాయం తెచ్చే విభాగాల అధికారులతో బుధవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్ అమ్మకాలపై ఐటీ పేరుతో కేంద్రం రూ.1264 కోట్లు తీసుకోవడంతో కొంతకాలం ఇబ్బంది పడిందని పేర్కొన్నారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని విభాగాలు నిర్దేశించిన లక్ష్యం లో 90 నుంచి 95 శాతం ఆదాయం తెచ్చిపెట్టాయని చెప్పారు. విభాగాల వారీగా గతేడాదితో పోలిస్తే 8 నుంచి 30 శాతం వృద్ధి రేటు ఉందన్నారు. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో అమ్మకపు పన్ను ఆదాయం రూ.200 కోట్లు పెరిగిందని చెప్పారు.
గతేడాదితో పోలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 25 శాతం పెరిగిందని పేర్కొన్నారు. వార్షిక బడ్జెట్ ప్రకారం తొలి నాలుగు నెలల్లో 28 శాతం ఆదాయం రావాల్సి ఉండగా తొమ్మిది రోజుల ముందే 26 శాతం రాబడి వచ్చిందని, భూముల అమ్మకం, క్రమబద్ధీకరణ మినహా బడ్జెట్‌లో అంచనా ప్రకారమే ఆదాయం వచ్చిందని వివరించారు. జూలై నెలాఖరుకు 32 శాతం ఖర్చులు అంచనా వేయగా, ఇప్పటికే 28.5 శాతం ఖర్చు చేసినట్లు చెప్పారు.
ఆదాయం పెంచుకునే దిశగా చేపట్టే చర్యలపై సమీక్షలో చర్చించామని ఆయన చెప్పారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
అప్పులు కూడా పరిమితిలోపే..
ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిలోపే రాష్ట్ర ప్రభుత్వం అప్పు సమీకరించిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థిక నిర్వహణలో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉందని చెప్పారు. దేశంలో వేస్ అండ్ మీన్స్, అడిషనల్ వేస్ అండ్ మీన్స్ అప్పును ఇప్పటికీ వినియోగించుకోని రాష్ట్రాలు గుజరాత్, తెలంగాణ మాత్రమేనని వివరించారు.
ఇటీవల ఆర్‌బీఐ నుంచి తీసుకున్న రూ.1500 కోట్లను.. మధ్యప్రదేశ్‌తో పోలిస్తే 0.1 శాతం తక్కువ వడ్డీకి తెచ్చుకున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.25,970 కోట్ల పన్నులు, పన్నేతర ఆదాయం వచ్చిందని, రూ.31,87 2 కోట్లు ఖర్చు అయిందని వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల లోపే రూ.6150 కోట్లు అప్పులు సమీకరించినట్లు చెప్పారు.