State revenue
-
AP: తగ్గిన రాష్ట్ర ఆదాయం
సాక్షి, అమరావతి: గత రెండు ఆర్థికసంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం కంటే 2019–20, 2020–21 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చే ఆదాయంతో పాటు రాష్ట్ర ఆదాయమూ తగ్గిపోయిందని వెల్లడించింది. కోవిడ్–19 ప్రభావం, లాక్ డౌన్, ఆంక్షల కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాతో పాటు రాష్ట్ర సొంత ఆదాయం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా కేంద్ర పన్నుల వాటా రూపంలో వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. 2018–19తో పోలిస్తే 2019–20లో రూ.4,545 కోట్లు తగ్గింది. 2020–21లో ఏకంగా రూ. 8,326 కోట్లు తగ్గింది. రాష్ట్ర వస్తు సేవల పన్నుతో పాటు అమ్మకం పన్ను, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర రంగాల ద్వారా వచ్చే ఆదాయం కూడాఆ రెండేళ్లలో తగ్గిపోయినట్లు తెలిపింది. బాగా పెరిగిన తప్పనిసరి వ్యయం రాష్ట్ర ప్రభుత్వ తప్పనిసరి వ్యయం బాగా పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ప్రధానంగా వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లు భారీగా పెరిగినట్లు తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21లో వడ్డీ చెల్లింపుల వ్యయం ఏకంగా 13 శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది. గతంలో చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు పెరిగిపోతున్నట్లు తెలిపింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం కూడా 2019–20తో పోలిస్తే 2020–21లో ఏకంగా 13 శాతం పెరిగినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం ఇవ్వడం, కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో వేతనాల వ్యయం భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ల వ్యయం కూడా 2019–20తో పోలిస్తే 2020–21లో 0.48 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. -
గణనీయంగా తగ్గనున్న రాష్ట్ర ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గనుంది. కరోనా అనంతర పరిస్థితుల్లో వార్షిక ఆర్థిక అం చనాల్లో భారీ లోటు కనపడేటట్లుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల ఆదాయాలు, అప్పులు, కేంద్ర ప్రభుత్వ సాయాల ద్వారా రూ.1.76 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ అంచనా కాగా, అందులో డిసెంబర్ నాటికి 59% రాబడి సమ కూరింది. డిసెంబర్–2020 నాటికి అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ.1,04,311.04 కోట్లు వచ్చినట్టు ‘కాగ్’కు రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా సమ ర్పించిన నివేదికలో వెల్లడిం చింది. ఇందులో అన్ని రకాల పన్ను ఆదాయం రూ. 67,149 కోట్లు కాగా, అప్పుల కింద మరో రూ. 37 వేల కోట్లు సమకూర్చు కున్నట్టు వెల్లడించింది. ఇలా ఖజానా లెక్క ఎట్టకేలకు రూ.లక్ష కోట్లు దాటింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలో ఇది 59% కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి బడ్జెట్ అంచనాలో 67% సమకూరింది. అంటే దాదాపు 8% ఈసారి లోటు అన్నమాట. కొన్ని తగ్గినా... కొన్ని పుంజుకుని వాస్తవానికి, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కరోనా మహమ్మారి చేసిన దాడితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. పూర్తిస్థాయిలో ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో బాండ్ల అమ్మకాలు, అప్పుల ద్వారా నెట్టుకు రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చాలా పకడ్బందీగా వ్యవహరించిన ఆర్థిక శాఖ రాష్ట్ర మనుగడకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లింది. అయితే, క్రమేపీ పరిస్థితుల్లో వస్తున్న మార్పు కారణంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్ రాబ డుల్లో పురోగతి కనిపిం చింది. ఈ ఏడాది జీఎస్టీ ద్వారా 32,671 కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, డిసెంబర్ ముగిసే నాటికి దాదాపు 53.5 శాతం అంటే రూ. 17,553 కోట్లు వచ్చింది. ఎౖMð్సజ్ రాబడుల ద్వారా రూ.16 వేల కోట్లు వస్తాయనుకుంటే... రూ.10,443 కోట్లు వచ్చింది. పన్నేతర రాబడులు తల్లకిందులు... అయితే, కేంద్ర పన్నుల్లో వాటా ప్రభుత్వం ఆశించిన మేర రావడం లేదని డిసెంబర్ నివేదిక వెల్లడిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,906 కోట్లు వస్తాయని అనుకున్నా మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటివరకు కేంద్ర పన్నుల వాటా కింద రూ.5వేల కోట్ల పైచిలుకు మాత్రమే వచ్చాయి. అదే విధంగా పన్నేతర రాబడులు కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వ అంచనాను తల్లకిందులు చేశాయి. పన్నేతర రాబడుల ద్వారా రూ.30,600 కోట్లు వస్తాయన్నది ప్రభుత్వ అంచనా కాగా, అందులో కేవలం 8.23 శాతం అంటే రూ.2,519.48 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద పన్నుల రాబడి అంచనా 1.43 లక్షల కోట్లలో 47 శాతం... అంటే రూ.67,149 కోట్లు సమకూరాయని ఆర్థిక శాఖ లెక్కలు చెపుతున్నాయి. అయితే, గత ఏడాది బడ్జెట్ అంచనాల్లో ఇదే సమయానికి 63 శాతం పన్ను రాబడి వచ్చిందని, ఈ లెక్కన చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడిలో రూ.22 వేల కోట్ల వరకు తగ్గుదల కనిపిస్తోందని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. అప్పు పెరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వ సొంత రాబడులు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం అప్పుల మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది రూ.33 వేల కోట్ల పైచిలుకు రుణాల ద్వారా తెచ్చుకోవాలనుకున్నా ఇప్పటికే అప్పు పద్దు రూ.37 వేల కోట్లు దాటింది. నవంబరు నెలలో రూపాయి అప్పు తీసుకోకపోయినా, డిసెంబర్లో మాత్రం మరో రూ.10వేల కోట్ల వరకు రుణం చేయాల్సి వచ్చింది. మొత్తం మీద గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటికే రూ.16వేల కోట్ల వరకు అప్పు ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగానే అప్పులు తెస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నా కరోనా కొట్టిన దెబ్బకు ఖజానా మరింత ఇరకాటంలో పడినట్టేనని ఆర్థిక నిపుణులంటున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది అప్పులకు వడ్డీల కింద రూ. 11,489 కోట్లు చెల్లించడం గమనార్హం. ఇక, కేంద్ర సాయం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ లెక్క మాత్రం ఈసారి ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఈ పద్దు కింద ఏడాదిలో రూ. 10,525 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఇప్పటికే అంతకంటే ఎక్కువగా రూ. 12,018 కోట్లు రావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అప్పులు నెలల వారీగా: నెల తీసుకున్న అప్పు (రూ.కోట్లలో) ఏప్రిల్ 5,709.23 మే 7,642.79 జూన్ 4,318.43 జూలై 3,113.39 ఆగస్టు 3,935.19 సెప్టెంబర్ 1,270.40 అక్టోబర్ 1,629.61 నవంబర్ –398.63 డిసెంబర్ 9,897.04 –––––––––––––––––––––––––––– మొత్తం 37,117.45 –––––––––––––––––––––––––––– -
అప్పు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బకు కుదేలైన రాష్ట్ర రాబడులు నెమ్మదిగా యథాతథ స్థితికి వస్తున్నాయి. కొత్త అప్పు చేయకుండానే రాష్ట్రం నవంబర్ మాసాన్ని నెట్టుకురాగలిగింది. ఇది ఊరటనిచ్చే అంశం. కరోనా మహమ్మారి మిగిల్చిన ఆర్థిక కష్టాలతో... 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచీ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పుడది మారిందని నవంబర్ నెల రాష్ట్ర ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: (1,950కోట్లు ఇవ్వండి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో రూపాయి కూడా అప్పు చేయలేదు. పైగా 398.63 కోట్ల రూపాయల అప్పును కూడా తీర్చింది. అటు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరులు గత మూడు మాసాలుగా నిలకడగా వస్తుండటం, ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 3,784 కోట్లు రావడంతో నవంబర్‌లో అప్పు పద్దుకు వెళ్లాల్సిన అవసరం రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. నిలకడగా ఆదాయం... ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే మొదలైన కరోనా కష్టాల నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టేనని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ మాసంలో కూడా పన్నుల రాబడి కింద రూ. 6,374 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరాయి. గత ఐదునెలలుగా రూ.6 వేల కోట్లు దాటుతున్న పన్ను ఆదాయం నవంబర్‌లో కూడా అదే స్థాయిలో రావడం గమనార్హం. ఇందులో జీఎస్టీ కింద నవంబర్ నెలలో రూ.2,360 కోట్లు సమకూరాయి. దీంతో వార్షిక బడ్జెట్ అంచనాల్లో జీఎస్టీ రాబడులు నవంబర్ నాటికి రూ. 15,247 కోట్లకు చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం నామమాత్రంగానే వచ్చిందని నవంబర్ కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ.1,000 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,027 కోట్లు ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఈసారి కేంద్ర పన్నుల్లో వాటా పెద్దగా రాలేదు కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 3,784 కోట్లు వచ్చాయి. మొత్తం మీద రెవెన్యూ రాబడులు ఈ ఏడాది రూ.1.43 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేయగా, నవంబర్ నాటికి రూ.56,948 కోట్లు వచ్చింది. మొత్తం అంచనాలో ఇది 39.82 శాతం మాత్రమే. ఇక, మొత్తం రాబడుల అంచనా రూ.1.76 లక్షల కోట్లు కాగా నవంబర్ నాటికి రూ.84,702 కోట్లు (47.74 శాతం) వచ్చింది. ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో మొత్తం రెవెన్యూ రాబడులు 70–75 శాతం మించే అవకాశం లేదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. చదవండి: (అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు) ఖర్చు కూడా పెరిగింది నవంబర్ మాసంలో ఆదాయంతో పాటు ఖర్చు కూడా పెరిగిందని కాగ్ గణాంకాలు చెపుతున్నాయి. రెవెన్యూ పద్దు కింద ఈ ఏడాదిలో నవంబర్ నెలలో అతి తక్కువగా రూ. 2,045 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబరులో ఉద్యోగుల వేతనాల కింద రూ. 2,558 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదే విధంగా పింఛన్ల కోసం కూడా ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబరులో రూ. 1,213 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. సబ్సిడీల కింద కూడా రూ. 1,400 కోట్ల వ్యయం జరిగింది. మొత్తం మీద నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.78,003 కోట్లు ఖర్చు పెట్టిందని కాగ్ వెల్లడించింది. -
రాబడి ఘనమే కానీ...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ ఆదాయం ఘనంగా ఉన్నప్పటికీ అప్పులు, వడ్డీల మోత కారణంగా ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ప్రతి నెలా వచ్చే రెవెన్యూ రాబడికి మించి ఖర్చులుండటం ఆర్థిక నిర్వహణను ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలన్నీ భారీ బడ్జెట్‌తో కూడుకున్నవి కావడంతో ఖజానాపై అంతకంతకూ భారం పెరిగిపోతోంది. దీంతో కొత్త పథకాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు సర్కారు వెనకాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన మధ్యంతర భృతిని ప్రకటించకుండా ఆపేయడానికి ఇదే ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ, రాష్ట్ర పన్నుల వాటా, ఎఫ్ఆర్బీఏం పరిధిలో తెచ్చుకునే అప్పులన్నీ కలిపితే ఒక్కో నెలా రాష్ట్రానికి సగటున రూ. 9,800 కోట్ల నుంచి రూ. 10,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్‌లో) రూ. 9,866 కోట్ల ఆదాయం రాగా అందులో రూ. 4,938 కోట్లు అప్పుగా తెచ్చినదే. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు నివేదించిన లెక్కలివి. ఇదే తీరుగా వచ్చే రెవెన్యూ రాబడితో పోలిస్తే నెలనెలా ఖర్చు సైతం అదే స్థాయిలో ఉండటం గమనార్హం. ఇప్పటికే చేసిన అప్పులకు ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ. 2,000 కోట్లు కిస్తులు చెల్లించాల్సి ఉంది. వీటికితోడుగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీలకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన ప్రభుత్వం చేపట్లే పనులకు మిగిలే నిధులు రూ. 2 వేల కోట్లకు మించడం లేదు. ఇదే సమయంలో రైతుల సంక్షేమానికి వరుసగా చేపట్టిన పథకాలు బడ్జెట్లో సింహభాగాన్ని ఆక్రమించాయి. జీతాలు మినహా నిలిచిన ఇతర బిల్లులు..! రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగులకు చెల్లించిన వేతనాల మొత్తం దాదాపు రూ. 24 వేల కోట్లు. ఈసారి 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2014లో పదో పీఆర్సీ 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని.. ఈసారి అంతకు మించిన వేతన సవరణ వస్తుందని ఉద్యోగులు ఆశలు, అంచనాలు పెంచుకున్నారు. మూల వేతనం అప్పుడే భారీగా పెరిగిందని, పెరిగిన మొత్తంపై మరోసారి భారీగా సవరణ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక శాతం వేతన సవరణ చేసినా రూ. 300 కోట్ల భారం పడుతుంది. ఆ లెక్కన 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటే ఒక్కసారిగా జీతాల భారం అదనంగా రూ. 18,900 కోట్లకు చేరుతుంది. అదే జరిగితే ప్రభుత్వం చేపట్టే ఇతర పనులు, కార్యక్రమాలకు నిధుల కొరత ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే రైతు బంధు చెక్కుల పంపిణీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా అనధికారికంగా నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించింది. ఉద్యోగుల జీతాలు తప్ప ఇతర పనుల బిల్లులన్నీ దాదాపుగా నిలిపేసింది. దాదాపు రూ. 3 వేల కోట్లకుపైగా బిల్లులకు చెక్కులు ఇచ్చినా డబ్బులు విడుదల చేయకుండా ఆపేసింది. దీంతో అన్ని విభాగాల్లో తమకిచ్చిన చెక్కులు డ్రా చేసుకోలేకపోతున్నామం టూ కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. రైతు పథకాలకే అధిక వాటా... గతంలో మూడేళ్లు రైతు రుణమాఫీకి నిధులు సర్దుబాటు చేసిన ప్రభుత్వం... ఈ ఏడాది రైతు పెట్టుబడి సాయం పథకానికి నిధులు ధారపోసింది. ఏటా ఎకరానికి రూ. 8 వేల చొప్పున రెండు విడతల్లో చెక్కుల పంపిణీకి దాదాపు రూ. 12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే రూ. 6 వేల కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం నవంబర్‌లో మరో రూ. 6 వేల కోట్ల పంపిణీకి సిద్ధమవుతోంది. ఇదే వ్యవధిలో రైతులకు రూ. 5 లక్షల జీవిత బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆగస్టులోనే దాదాపు రూ. 1,000 కోట్లను రైతుల పేరిట ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించనుంది. దీంతో రైతు పథకాలకు ఈ ఏడాది రూ. 13 వేల కోట్లు ఖర్చు చేయనుంది. అందుకే ప్రభుత్వం కొత్త పనులకు వెనకాడుతోంది. రైతులకు అవసరమైన నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 8 వేల కోట్ల మార్కెట్ రుణాలను సమీకరించింది. ఏప్రిల్‌లో రూ. 4,932 కోట్లను ఆర్బీఐ వేలం ద్వారా అప్పు తీసుకోగా మే, జూన్ నెలల్లో రూ. 3,500 కోట్లు అప్పు చేసింది. తాజాగా ఈ నెల ఒకటో తేదీన జరిగిన వేలంలో రూ. వెయ్యి కోట్లు అప్పు తీసుకుంది. -
రాష్ట్ర ఆదాయంలో 19 శాతం వృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆదాయం నిరుటి కంటే 19 శాతం వృద్ధి సాధించింది. క్రమంగా జీఎస్టీపై ఉన్న అనుమానాలు తొలగిపోయి రాబడి పుంజుకుంది. ఆర్థిక శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు గడిచిన తొమ్మిది నెలల్లో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.29,811 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో వ్యాట్ ద్వారా రూ.24,977 ఆదాయం సమకూరింది. సరిగ్గా ఈ ఏడాది అదే వ్యవధిలో వచ్చిన ఆదాయం రూ.26,982 కోట్లకు చేరింది. పెట్రోలియం, ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం జీఎస్టీ పరిధిలో లేదు. ఎక్సైజ్ ఆదాయం సైతం జోడిస్తే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.29,811 కోట్లకు చేరింది. మొత్తంగా నిరుటితో పోలిస్తే సగటున 19 శాతం ఆదాయం పెరిగింది. దీంతో ప్రధానంగా జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందనే అపోహలు, అనుమానాలు తొలగిపోయాయి. జీఎస్టీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులమీద వచ్చే ఐజీఎస్టీ, మద్యం, పెట్రోలియం ద్వారా వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన జీఎస్టీ పరిహారం ఆదాయ పెంపునకు దోహదపడ్డాయి. ఆశించినంత రాబడి పెరగటంతో ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌పై భారీగానే అంచనాలు వేసుకుంటోంది. గతఏడాది వ్యాట్ అమల్లో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కొత్త విధానం కావటంతో తొలి మూడు నెలల్లో ఆదాయ వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. కానీ క్రమంగా జీఎస్టీ ఆదాయం స్థిరపడింది. ఈ నేపథ్యంలో గతేడాది నెలాఖరు వరకు ఉన్న రాష్ట్ర ఆదాయం, ఇప్పుడున్న రాష్ట్ర ఆదాయాన్ని ఆర్థిక శాఖ విశ్లేషించుకుంది. ఇందులో 19 శాతం ఆదాయ వృద్ధి నమోదైంది. -
జూలైలో రూ.582 కోట్లు!
♦ రాష్ట్ర జీఎస్టీ ద్వారా సమకూరిన మొత్తం ♦ కేంద్ర జీఎస్టీ రూ.372 కోట్లు.. అంతర్రాష్ట్ర జీఎస్టీ రూ.683 కోట్లు ♦ వాణిజ్య పన్నుల శాఖ లెక్కలు ♦ అంతర్రాష్ట్ర జీఎస్టీ పంపకాల తర్వాతే లాభనష్టాలపై స్పష్టత సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి నెలలో రాష్ట్ర ఆదాయంలో కొంత మేరకు గండి పడింది. జూలైలో దాదాపు రూ.700 కోట్ల మేర ఆదాయం తగ్గినట్లుగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు వచ్చినంత మేరకు ఆదాయం సమకూరుతుందా.. జీఎస్టీతో రాష్ట్ర ఖజానాకు లాభమా, నష్టమా అనే దానిపై వాణిజ్య పన్నుల శాఖ, ఆర్థిక శాఖ అధికారులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. రూ.700 కోట్ల లోటు.. ఈ ఏడాది జూన్‌లో వ్యాట్, ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.3,100 కోట్ల ఆదాయం సమకూరింది. దేశవ్యాప్తంగా జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ సిద్ధం చేసిన నివేదిక ప్రకారం జూలైలో రాష్ట్ర జీఎస్టీ రూ.582 కోట్లు, కేంద్ర జీఎస్టీ రూ.372 కోట్లు, అంతర్రాష్ట్ర జీఎస్టీ రూ.683 కోట్లు, సెస్ ద్వారా రూ.421 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.654 కోట్లు, పెట్రోలియం ద్వారా రూ.720 కోట్లు పన్నుల రూపంలో సమకూరినట్లు వెల్లడైంది. దీంతో కేంద్ర జీఎస్టీ, అంతర్రాష్ట్ర జీఎస్టీ పక్కనబెడితే.. ఎక్సైజ్ ఆదాయంతో కలిపి రాష్ట్ర ఖజానాకు రూ.2,377 కోట్లు జమైనట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే దాదాపు రూ.700 కోట్ల లోటు కనిపిస్తోంది. కొంత కలవరపరిచే అంశమైనప్పటికీ.. అంతర్రాష్ట్ర జీఎస్టీలో రాష్ట్రానికి వచ్చే వాటాతో ఈ లోటు భర్తీ అయ్యే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర జీఎస్టీలో రాష్ట్రానికి వాటా రాష్ట్రంలో అంతర్రాష్ట్ర జీఎస్టీ పద్దు కింద రూ.683 కోట్లు వసూలైంది. ఆయా వస్తువులు, సరుకుల అమ్మకాలు, రవాణా ఆధారంగా ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ అవుతుంది. అదే తీరుగా ఇతర రాష్ట్రాల్లో వసూలైన అంతర్రాష్ట్ర జీఎస్టీలో తెలంగాణకు వాటా సమకూరుతుంది. ఉదాహరణకు తెలంగాణకు చెందిన వారు చాలా మంది హరియాణాలో ఫోర్ వీలర్ వాహనాలు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నారు. వీరందరూ అక్కడ అంతర్రాష్ట్ర జీఎస్టీ చెల్లిస్తారు. అంతమేరకు ఆ రాష్ట్రంలో వసూలైన అంతర్రాష్ట్ర జీఎస్టీలో తెలంగాణకు రావాల్సిన వాటా ఖజానాకు జమవుతుంది. ప్రతి మూడు నెలలకోసారి ఈ సర్దుబాటు జరుగుతుందని, అక్టోబర్ నెలాఖరు వరకు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ వాటాగా వచ్చే అంతర్రాష్ట్ర జీఎస్టీ ఎంత మొత్తం ఉంటుందనేది లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర జీఎస్టీ ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం పెరిగినా అంతమేరకు రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కూడా కొంతమేరకు పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు జీఎస్టీతో లాభనష్టాలు బేరీజు వేయటం సరికాదని, అక్టోబర్ నెలాఖరున అంచనాకు వచ్చే అవకాశముంటుందని ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటోంది. -
ఆక్వా నుంచి రాష్ట్రానికి రూ.16వేల కోట్లు
నెల్లూరు (టౌన్) : రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆక్వా నుంచి రూ.16 వేల కోట్లు ఆదాయం వస్తుందని మాజీ ఎమ్మెల్యే, బీఎంఆర్ సంస్థ అధినేత బీద మస్తాన్‌రావు తెలిపారు. వర్సిటీ మెరైన్ బయోలాజీ విభాగంలో ప్రారంభమైన రెండు రోజుల మెరైన్ అండ్ కోస్టల్ బయో డైవర్సిటీ ఆఫ్ ఇండియ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సదస్సులో బీద మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఆదాయం రావడంతోనే బడ్జెట్లో ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.835 కోట్లు కేటాయించిందన్నారు. బ్లాక్ టైగర్ రొయ్యకు అనుకోని విధంగా తెల్లమచ్చ వైరస్ సోకడంతో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారని చెప్పారు. 2002లో వెనామీ రొయ్య సాగును ప్రథమంగా బీఎంఆర్ సంస్థ తైవాన్ నుంచి దిగుమతి చేసుకుందన్నారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలలో విజ్ఞానంతో పాటు నైపుణ్యం అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా వస్తాయని చెప్పారు. నేడు మొబైల్ ప్రయోగాశాల నిర్వహించినా ఒక మెరైన్ బయోలజీ విద్యార్థికి నెలకు రూ.3 లక్షలు ఆదాయం లభిస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటరావు, సదస్సు కార్యనిర్వహక కార్యదర్శి విజయ, ఆచార్యులు సుజాత, హరిబాబు, ప్రభుశరన్, డాక్టర్ రేచెల్ కుమారి, డాక్టర్ హనుమారెడ్డి, డాక్టర్ వెంకటరాయులు, పాలకమండలి సభ్యులు కుసుమ, మాల్యాద్రి, చంద్రయ్య పాల్గొన్నారు. -
ఆదాయం భేష్: మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆదాయానికి ఎటువంటి ఢోకా లేదని ఆర్థిక మంత్రి ఈటల రా జేందర్ అన్నారు. వార్షిక బడ్డెట్‌లోని అంచనాల మేరకు ఆదాయ వ్యయాలున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ర్ట ఆదా యం మరింత పెరుగుతుందనే నమ్మకముం దని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే తె లంగాణ అగ్రగామిగా వెలుగొందుతోందని, ఖజానా ఖాళీ అయిందని వస్తున్న వార్తలు ఊహాజనితమని స్పష్టం చేశారు. ప్రభుత్వాని కి ఆదాయం తెచ్చే విభాగాల అధికారులతో బుధవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్ అమ్మకాలపై ఐటీ పేరుతో కేంద్రం రూ.1264 కోట్లు తీసుకోవడంతో కొంతకాలం ఇబ్బంది పడిందని పేర్కొన్నారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని విభాగాలు నిర్దేశించిన లక్ష్యం లో 90 నుంచి 95 శాతం ఆదాయం తెచ్చిపెట్టాయని చెప్పారు. విభాగాల వారీగా గతేడాదితో పోలిస్తే 8 నుంచి 30 శాతం వృద్ధి రేటు ఉందన్నారు. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో అమ్మకపు పన్ను ఆదాయం రూ.200 కోట్లు పెరిగిందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 25 శాతం పెరిగిందని పేర్కొన్నారు. వార్షిక బడ్జెట్ ప్రకారం తొలి నాలుగు నెలల్లో 28 శాతం ఆదాయం రావాల్సి ఉండగా తొమ్మిది రోజుల ముందే 26 శాతం రాబడి వచ్చిందని, భూముల అమ్మకం, క్రమబద్ధీకరణ మినహా బడ్జెట్లో అంచనా ప్రకారమే ఆదాయం వచ్చిందని వివరించారు. జూలై నెలాఖరుకు 32 శాతం ఖర్చులు అంచనా వేయగా, ఇప్పటికే 28.5 శాతం ఖర్చు చేసినట్లు చెప్పారు. ఆదాయం పెంచుకునే దిశగా చేపట్టే చర్యలపై సమీక్షలో చర్చించామని ఆయన చెప్పారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అప్పులు కూడా పరిమితిలోపే.. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిలోపే రాష్ట్ర ప్రభుత్వం అప్పు సమీకరించిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థిక నిర్వహణలో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉందని చెప్పారు. దేశంలో వేస్ అండ్ మీన్స్, అడిషనల్ వేస్ అండ్ మీన్స్ అప్పును ఇప్పటికీ వినియోగించుకోని రాష్ట్రాలు గుజరాత్, తెలంగాణ మాత్రమేనని వివరించారు. ఇటీవల ఆర్బీఐ నుంచి తీసుకున్న రూ.1500 కోట్లను.. మధ్యప్రదేశ్‌తో పోలిస్తే 0.1 శాతం తక్కువ వడ్డీకి తెచ్చుకున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.25,970 కోట్ల పన్నులు, పన్నేతర ఆదాయం వచ్చిందని, రూ.31,87 2 కోట్లు ఖర్చు అయిందని వెల్లడించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితుల లోపే రూ.6150 కోట్లు అప్పులు సమీకరించినట్లు చెప్పారు. -
రాష్ట్ర ఖజానాకు ఉద్యమ సెగ
-
హైదరాబాద్ ఆదాయాల పై తర్జన భర్జన