ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం : ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... శివ, కమలమ్మ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ క్రమంలో ఇద్దరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే శివకి పెళ్లయింది. ఆ విషయం తెలిసిన కమలమ్మ తరచు శివతో ఘర్షణకు దిగేది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఎవరికి వారు విడిగా ఉంటున్నారు.
కాగా శుక్రవారం ఉదయం శివ ఇంటికి ముందు కమలమ్మ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియుడు శివ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కమలమ్మ మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.