భార్య కాపురానికి రావడం లేదని..
నెక్కొండ (వరంగల్) : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి దూకుతానని బెదిరిస్తున్న సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండలో సోమవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన వీరన్న(29)కు ఎనిమిదేళ్ల క్రితం తిమ్మాపురం గ్రామానికి చెందిన మహేశ్వరి(25)తో వివాహమైంది.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరన్న మద్యానికి బానిసై భార్యను వేధింపులకు గురిచేస్తుండటంతో.. మూడు నెలల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన వీరన్న సోమవారం సాయంత్రం తన ఇంటి ముందు ఉన్న రిలయన్స్ టవర్ ఎక్కి అక్కడి నుంచి దూకుతానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దించడానికి యత్నిస్తున్నారు.