టీసీ వస్తున్నాడని రైల్లోంచి దూకేశాడు..
Published Mon, Feb 29 2016 12:17 PM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM
వరంగల్: టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు టీసీ వస్తున్నాడని భయపడి కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం సమీపంలో చోటు చేసుకుంది. మణుగూరు నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌లో వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలులో సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. కేససముద్రం సమీపంలో ఓ ప్రయాణికుడు టీసీ వస్తున్నాడని భయపడి రైలు నుంచి కిందికి దూకాడు. విషయం తెలిసిన అధికారులు రైలును ఆపివేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement