న్యూఢిల్లీ: దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కరి తలపై రుణ భారం రూ.2,966 పెరిగి రూ.44,095కు చేరింది. విదేశీ, అంతర్గత, ఇతర రుణాలన్నీ కలిపి భారం ఈ స్థాయికి చేరింది. వృద్ధి రేటును మెరుగుపరచడం కోసం ప్రభుత్వం చేసిన అధిక అభివృద్ధి వ్యయం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో భారతీయుడిపై రుణ భారంరూ.3,000 చొప్పున పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2013-14లో తలసరి రుణ భారం రూ.41,129 కోట్లుగా ఉంది.
కాగా 2015 ఏడాదికి ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ రుణ గణాంకాల ప్రకారం 20 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక విదేశీ రుణాలున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చినాటికి మొత్తం భారత రుణ భారం రూ.68.95 లక్షల కోట్లు.
ఒక్కో భారతీయుడిపై రూ.44,095 అప్పు
Published Mon, Jul 27 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM
Advertisement
Advertisement