'రాష్ట్రంలో పాలన ప్రైవేట్ లిమిటెడ్ గా మారింది'
'రాష్ట్రంలో పాలన ప్రైవేట్ లిమిటెడ్ గా మారింది'
Published Wed, Dec 2 2015 1:19 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాకర్ల రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డి, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లలో ప్రభుత్వం పూర్తిగా కాంట్రాక్టర్లకే అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ బిడ్డింగ్, టెండర్ల నియయ నిబంధనలను పక్కన పెట్టి ఏపీ కాంట్రాక్టర్లకు ప్రాజెక్ట్ లను కట్టబెడుతోందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా ప్రైవేటుపరం చేస్తామనడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ప్రైవేట్ లిమిటెడ్ గా మారిందని ఎద్దేవా చేశారు.
Advertisement