'అనంత'లో వైఎస్ఆర్ సీపీ నేతపై ఎస్ఐ దాడి | si narendra bhupathi attack on ysrcp leadar ravikumar in anantnpur | Sakshi
Sakshi News home page

'అనంత'లో వైఎస్ఆర్ సీపీ నేతపై ఎస్ఐ దాడి

Published Wed, Aug 5 2015 9:23 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

si narendra bhupathi attack on ysrcp leadar ravikumar in anantnpur

అనంతపురం(నల్లచెరువు): అనంతపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై వేధింపులు ఆగడంలేదు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు అధికారపార్టీ అండ చూసుకుని చెలరేగిపోతున్నారు. తాజాగా..నల్లచెరువులో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ రవికుమార్ రెడ్డిపై ఎస్‌ఐ నరేంద్రభూపతి దాడి చేశారు. రవి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన పొలం నుంచి ఇన్నోవా కారులో వస్తుండగా సీటు బెల్టు ఎందుకు పెట్టుకోలేదని నానా బూతులు తిట్టాడు.

ఇదేమిటి అని అడిగిన రవిపై ఎస్ఐ చేయిచేసుకున్నాడు. కారును పాక్షికంగా ధ్వంసం చేశాడు. ఊరు వదిలి వెళ్లకపోతే నీ అంతు చూస్తానని ఎస్‌ఐ బెదిరించాడు. గాయాలైన రవి కదిరి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైఎస్సార్‌సీపీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా బుధవారం ఉదయం రవిని పరామర్శించారు. సర్పంచ్ పై దాడిని ఆయన ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement