ఎస్‌వోటీ పోలీస్ పేరుతో వసూళ్లు: కానిస్టేబుల్ అరెస్ట్
Published Mon, Jan 4 2016 10:23 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
హైదరాబాద్: ఎస్‌వోటీ పోలీసుల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న ఓ కానిస్టేబుల్‌ను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న గణేష్ గత కొద్ది రోజులుగా ఎస్‌వోటీ పోలీసునని చెప్పి మామూళ్లు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎస్‌వోటీ పోలీసులు అతని పై నిఘా పెంచారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఎస్‌వోటీ పోలీసునని బెదిరించి బలవంతంగా డబ్బులు తీసుకుంటున్న సమయంలో రంగ ప్రవేశం చేసిన ఎస్‌వోటీ పోలీసులు గణేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement