భాగ్యనగరంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలి కమీషనర్ కార్యాలయంలో రాచకొండ జాయింట్ కమీషనర్ తరుణ్‌జోషి మీడియాతో మాట్లాడారు.
నిందితుల వద్ద నుంచి 9 ల్యాప్‌టాప్‌లు, 8 పాస్‌పోర్ట్‌లు, 25 సెల్‌ఫోన్‌లు, 15 డేటా కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మీ ఫోన్ నెంబర్ లక్కీ డ్రాలో ఎంపిక అయిందని మాయమాటలు చెప్పి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.