సీఎం వద్దకు ద్విచక్ర ‘108’ ఫైలు
ఆమోదించిన వెంటనే నగర రోడ్లపైకి..
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రద్దీతో కొట్టుమిట్టాడే హైదరాబాద్‌లో ద్విచక్ర ‘108’ అంబులెన్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ సంబంధిత ఫైలును సీఎం ఆమోదం కోసం పంపింది.
ముందుగా 50 ద్విచక్ర అంబులెన్సులు అవసరమని ప్రతిపాదన పెట్టింది. ఒక్కో ద్విచక్ర వాహనానికి, దానికి అనుబంధంగా వైద్య పరికరాల కోసం రూ. 1.25 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ద్విచ క్ర వాహన కంపెనీలు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించారు. త్వరలో నగర రోడ్లపైకి ఈ ద్విచక్ర అంబులెన్సులు రానున్నాయని ఓ వైద్యాధికారి పేర్కొన్నారు.