traffic congestion
-
కార్ పూలింగ్.. వేర్వేరు పనివేళలు
సాక్షి, హైదరాబాద్: ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు.. ఇలా ఎన్ని నిర్మించినా హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గడం లేదు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. చినుకు పడితే చాలు కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. దీంతో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ ఐటీ కంపెనీలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఇన్ఫోసిటీలో సమావేశమయ్యారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతోపాటు నిర్వహణ వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. ఢిల్లీలో అమలవుతున్న కార్ పూలింగ్ విధానాన్ని ఐటీ కారిడార్ పరిధిలోనూ అమలు చేయడాన్ని ఐటీ సంస్థలు పరిశీలించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ సూచించారు. ఈ విధానంతో వాహనాల రద్దీ, కాలుష్యం తగ్గడంతోపాటు ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగులందరికీ ఒకే పనివేళలు కాకుండా వేర్వేరు సమయాలను కేటాయించాలన్నారు. దీనివల్ల కూడా వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేష్ కాజా తదితరులు పాల్గొన్నారు.కార్ పూలింగ్ అంటే?ఒకే ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఒక్కో వాహనంలో వచ్చే బదులు నలుగురు చొప్పున కలిసి ఒకే కారులో ఆఫీసుకు రావడాన్ని కార్ పూలింగ్ అంటారు. ఈ విధానంలో ఒకరోజు ఒక ఉద్యోగి కారు తీసుకొస్తే ఆ మరుసటి రోజు మరో ఉద్యోగి కారులో ప్రయాణిస్తారు. దీంతో ప్రతిరోజూ ఒకే సమయంలో, ఒకే రహదారిలో నాలుగు కార్లు రోడ్లపైకి రాకుండా ఒకే కారులో నలుగురు ఉద్యోగులు ఆఫీసుకు చేరుకుంటారు. -
దరి చేర్చని దారి!.. గ్రేటర్లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ మెట్రోరైల్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో సుమారు 1500కుపైగా కాలనీలు ఉంటాయి. ఆ కాలనీల నుంచి ప్రతి రోజూ వేలాది మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మెట్రో ఉన్నా వినియోగించుకొనే పరిస్థితి లేదు. దానికి కారణం ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సరిగా లేకపోవడమే. అంటే కాలనీ నుంచి మెట్రో స్టేషన్‌కు.. రైలు దిగాక మెట్రోస్టేషన్ నుంచి ఆఫీసుకో, మరేదైనా చోటికో వెళ్లడానికి సరైన ప్రజా రవాణా సదుపాయాలు లేకపోవడమే. మెట్రోలో అయితే త్వరగా వెళ్లగలిగినా.. ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి ఆఫీసుకు వెళ్లడానికి ఆటో ఎక్కితే ఖర్చు అడ్డగోలుగా పెరిగిపోతోంది. దీంతో జనం సొంత వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఇది నగరంలో భారీగా ట్రాఫిక్, పొల్యూషన్ పెరిగిపోవడానికి కారణమవుతోంది.ఉదాహరణకు..: ఉప్పల్ సమీపంలోని కాలనీ వ్యక్తి రాయదుర్గంలోని ఆఫీసుకు వెళ్లాలంటే.. కాలనీ నుంచి మెట్రోస్టేషన్‌కు వెళ్లేందుకు రూ.75 నుంచి రూ.100 చార్జీతో ఆటోలో ప్రయాణించాలి. అక్కడి నుంచి మెట్రోలో రాయదుర్గం వరకు రూ.55 చార్జీ ఉంటుంది. రైలు దిగి ఆఫీసుకు చేరేందుకు మరో రూ.50 వెచ్చించాలి. తిరిగి ఇంటికి వెళ్లడానికి మళ్లీ ఖర్చు తప్పదు. ఉప్పల్ మెట్రోస్టేషన్‌కు ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వచి్చన దుస్థితి ఇది. ఒక్క ఉప్పల్ మెట్రోస్టేషన్ మాత్రమే కాదు. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లకు సరైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణం భారంగా మారుతోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాల వినియోగానికే మొగ్గుచూపుతున్నారు.సవాల్‌గా మారిన సమన్వయం..గ్రేటర్లో మొదటి నుంచీ ప్రజారవాణా సదుపాయాల మధ్య సమన్వయం లేదు. సిటీబస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్ల సేవలు ఇప్పటికీ విడివిడిగానే ఉన్నాయి. 2017లో మెట్రో సేవలను ప్రారంభించినప్పుడు అన్ని స్టేషన్లకు చేరేందుకు బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రయాణికులను స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ మినీ బస్సులను ప్రతిపాదించింది. ఫీడర్ చానళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అవేవీ అమల్లోకి రాలేదు. గతంలో ఎంఎంటీఎస్ స్టేషన్లకు అనుసంధానంగా ప్రత్యేకంగా సిటీబస్సులను ప్రవేశపెట్టినా ఎంతో కాలం కొనసాగలేదు. దీంతో ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సమస్య అలాగే ఉండిపోయింది.మెట్రోకు అనుసంధానం లేక..నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ మధ్య ప్రస్తుతం ప్రతిరోజూ 5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. రోజుకు 1,000 ట్రిప్పులకుపైగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేక ఇంకా లక్షలాదిమంది మెట్రోకు దూరంగానే ఉంటున్నారు. మెట్రోస్టేషన్‌కు కనీసం 5 కిలోమీటర్ల పరిధిలో ఫీడర్ చానల్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది.ఓలా, ఉబర్, ర్యాపిడో,యారీ వంటి యాప్ ఆధారిత క్యాబ్‌లు, ఆటోలు మినహాయిస్తే మెట్రోస్టేషన్ల నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ చాలా తక్కువ. 16 ఆర్టీసీ సైబర్ లైనర్ బస్సులు, 135 మెట్రో సువిధ (12 సీట్లవి) వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలకు వెళ్లే సైబర్ లైనర్లు, సువిధ వాహనాలకు డిమాండ్ ఉంది.జనాభా పెరుగుతున్నా.. సదుపాయాలు అంతే! గ్రేటర్ హైదరాబాద్ జనాభా సుమారు 2 కోట్లకు చేరువైంది. ఏటా లక్షలాది మంది నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. అన్ని వైపులా పెద్ద సంఖ్యలో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కానీ ఇందుకు తగినట్టుగా ప్రజారవాణా సదుపాయాలు పెరగడం లేదు. బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 6,000 బస్సులు అందుబాటులో ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్‌లో 2,550 బస్సులే ఉన్నాయి. ఇక 70 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. నగర అవసరాల మేరకు మరో 100 ఎంఎంటీఎస్ రైళ్లను నడపాల్సి ఉంది. మెట్రో రైళ్లు కూడా మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. అన్ని సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.‘వాహన విస్ఫోటనం’!హైదరాబాద్ నగరంలో వాహన విస్ఫోటనం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతం వాహనాల సంఖ్య 80 లక్షలకుపైనే ఉంది. వీటిలో 70 శాతానికిపైగా వ్యక్తిగత వాహనాలే కావడం గమనార్హం.కోవిడ్ అనంతరం 2022 నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అవసరం బాగా పెరిగింది. మొదట 15 రూట్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 58 స్టేషన్లకు విస్తరించినట్లు అధికారులు చెప్తున్నారు. మెట్రో రైడ్ ఆఫ్ ఇండియా (ఎంఆర్ఐ), ఈవీ ఆటోలు నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయం ఉన్న మెట్రో స్టేషన్లు చాలా తక్కువ. కనెక్టివిటీ పెరిగితే మరో 5 లక్షల మందికిపైగా మెట్రోలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.నగరంలో ప్రతి కిలోమీటర్‌కు 1,732 ద్విచక్రవాహనాలు, మరో 1,000 కార్లు ప్రయాణిస్తున్నాయి. అన్ని మార్గాల్లో కలిపి ఒకే సమయంలో సుమారు 55,000 బైకులు, మరో 30,000 కార్లు వెళ్తున్నాయి. రవాణా నిపుణుల అంచనా మేరకు రోడ్లపై వాహనాల సంఖ్య 25,000 దాటితే అత్యధిక వాహన సాంద్రత ఉన్నట్లుగా పరిగణించాలి. సొంత బండితోనూ.. తప్పని కష్టాలుమెట్రోలు, ఎంఎంటీఎస్లలో ప్రయాణించలేక.. చాలా మంది సొంత కారు, ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దీనితో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో నాగోల్ నుంచి రాయదుర్గం చేరుకొనేందుకు 45 నిమిషాల సమయం పడితే.. బైక్ జర్నీకి గంటన్నర, కారులో అయితే 2 గంటలకుపైగా సమయం పడుతుంది. పైగా మానసిక ఒత్తిడి, పొల్యూషన్ సమస్య. ముంబైలో కనెక్టివిటి బాగుండటంతో.. ఎక్కువ దూరం ప్రయాణించేవారిలో చాలా మంది రైళ్లలోనే వెళ్తారు.కామన్ మొబిలిటీ టికెట్ ప్రవేశపెట్టాలి ప్రజారవాణా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. నేషనల్ కామన్ మొబిలిటీ టికెట్ (ఎన్‌సీఎంటీ)ను ప్రవేశపెట్టాలి. సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, ఆటోలు, బైక్ ట్యాక్సీలు తదితర అన్ని రవాణా సదుపాయాలను ఒకే కార్డుతో వినియోగించుకొనే అవకాశం ఉండాలి. దాని వల్ల ప్రయాణికులు ఒక రవాణా సదుపాయం నుంచి మరో రవాణా సదుపాయానికి ఈజీగా మారుతారు. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ లేని ఎల్బీనగర్– నాగోల్ వంటి రూట్లలో ఆర్టీసీ ఉచిత బస్సులను ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. – మురళి వరదరాజన్, ఎల్అండ్టీ మెట్రో చీఫ్ స్ట్రాటజీ అధికారి రవాణా అవసరాలు తేల్చేందుకు ఇంటింటి సర్వే.. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజారవాణా అవసరాలపై హుమ్టా సంస్థ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. లీ అసోసియేషన్ ద్వారా ఈనెల 18 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నాం. ప్రతి ఇంటి రవాణా అవసరాలు, వినియోగిస్తున్న వాహనాలపై ఈ అధ్యయనం ఉంటుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన ట్రాఫిక్ రద్దీ ఉత్పన్నమవుతోందనేది కూడా పరిశీలిస్తాం. లీ అసోసియేషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ రకమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందనేదానిపై స్పష్టత వస్తుంది. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3 నెలల్లో లీ అసోసియేషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. – జీవన్‌బాబు, హుమ్టా ఎండీ ప్రజా రవాణా విస్తరించకపోవడం వల్లే.. ప్రజారవాణా విస్తరించకపోవడం వల్ల కూడా సొంత వాహనాల వినియోగం పెరిగింది. బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. సొంత కారు, సొంత బైక్ సిటీ కల్చర్‌లో ఒక భాగంగా మారింది. ఒకప్పుడు సైకిళ్ల నగరంగా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు బైక్‌ల నగరంగా మారింది. – ఎం.చంద్రశేఖర్‌గౌడ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, రంగారెడ్డి -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. కిలోమీటర్లమేర నిలిచిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలో కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక వాకర్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతవరణశాఖ వెల్లడించింది. కూకట్పల్లి వై జంక్షన్ చెరువును తలపిస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. మెట్రో పక్కన పార్క్ చేసిన బైక్‌లు నీటిలో మునిగాయి. ఫతేనగర్ స్టేషన్ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 5 అడుగులకు పైగా వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఫతేనగర్ మీదుగా వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ సిబ్బంది సూచించారు. అమీర్‌పేట్ నుంచి కూకట్పల్లి వెళ్లే వాహనాలు నిలిపివేశారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ మెట్రో ఇబ్బందులు భారీ వర్ష ప్రభావం మెట్రో స్టేషన్లను కూడా తాకింది. మెట్రో స్టేషన్లలో సర్వర్ ప్రాబ్లమ్ తలెత్తింది. టికెట్లు ఇష్యూ కాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో అరగంట నుంచి మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
శ్రీనగర్ కాలనీలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
హైదరాబాద్: శ్రీనగర్ కాలనీలోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ మాసుంబాషా, బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ రావు అక్కడ పర్యటించారు. నాలుగువైపులా కూడలి ఉండటంతో వాహనాలు ఇష్టమొచ్చినట్లు మళ్లుతున్నాయని దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు పరిష్కారంగా ఇక్కడ టూ వే చేయాలని నిర్ణయించారు. శ్రీనగర్ కాలనీ వైపు నుంచి టీవీ 9 వైపు బంజారాహిల్స్‌కు వెళ్లే వాహనదారులు నేరుగా వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే, టీవీ9 వైపు నుంచి పెట్రోల్ బంక్ మీదుగా రత్నదీప్ సూపర్‌మార్కెట్ వైపు వెళ్లేందుకు వీలుపడదు. ఇటు వైపు వాహనాలను అనుమతించకుండా మధ్యలో డివైడర్‌ను ఏర్పాటు చేస్తారు. రత్నదీప్ వైపు వెళ్లేవారు శ్రీనగర్‌కాలనీ పార్కు వైపు నుంచి యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగు వైపులా వాహనాలను అనుమతించకుండా కేవలం రాకపోకలు మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అధికారులు తెలిపారు. -
కళ్లలో యుద్దం
జిల్లాలో పెరుగుతున్న వాహనాల రద్దీ కాలుష్య కోర ల్లో చిక్కుకుంటున్న పట్టణాలు దెబ్బతింటున్న వాహనదారుల ఆరోగ్యం నిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకునే వారి కళ్లకు పొంచి ఉన్న ముప్పు జిల్లాలో వాహనాల రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఫలితంగా వాతావరణంలో ధూళికణాలు భారీగా పేరుకుపోతున్నాయి. ట్రాఫిక్‌లో కళ్లకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. ఏకాగ్రత కోల్పోవడం, విచక్షణా శక్తి దెబ్బతినడం వంటి మానసిస సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడిపేవారికి కూడా కళ్లల్లోతడి ఆరిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. తిరుపతి క్రైం: సున్నితమైన నేత్రాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిత్యం నేరుగావచ్చి పడే దుమ్ము కణాల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నీరుకారడం .. మంట.. ఎర్రబడడం .. వంటివాటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యం రోడ్లపై ప్రయాణించే జిల్లావాసులు ఈ తరహా సమస్యలతో నేత్ర వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ సర్వేలోనూ ఈ విషయం స్పష్టమైంది. జిల్లాలో సుమారు వాహనాలు 3.5 లక్షలకు పైగా ఉన్నాయి. వీటికితోడు కలియుగ వైకుంఠం తిరుమలకు రోజూ ఇతర ప్రాంతాల నుంచి 15 వేల వాహనాలు వస్తుంటాయి. వీటికితోడు జిల్లాలో అక్కడక్కడా రోడ్డు పనులు జరుగుతుం టాయి. ఫలితంగా వాతావరణ, గాలి కాలుష్యం తీవ్రమవుతోంది. వాస్తవానికి పీఎం 2.5 ధూళికణాలు ఘనపు మీటరు గాలిలో- 40 మైక్రోగ్రాములు, పీఎం-10 ధూళికణాలు- 60 మైక్రోగ్రాములు నుంచి వుంటే ప్రమాదమే. జిల్లాలో ప్రధాన పట్టణాలైన చిత్తూరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం, పుత్తూరు, సత్యవేడు, గంగాధరనెల్లూరు, పలమనేరు, పీలేరు తదితర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. సర్వేలో తేలిన అంశాలు ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల చాలామంది కంటి పరీక్షలు చేపట్టారు. ఇందులో జిల్లాలోని మొత్తం వాహనదారుల్లో దాదాపు 12శాతం మందిలో కంటి దురద, నీరు కారడం, ఎర్రబడడం గుర్తించారు. గాలి, వాతావరణ కాలుష్యం కారణంగా ఇవి వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇందులో 20-40 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతలు, ఇతర పనులతో నిత్యం ట్రాఫిక్‌లో తిరిగేవారు నేత్ర సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవి చేయకూడదు.. కళ్లు.. దురదపుట్టిన వెంటనే అదేపనిగా నలపకూడదు, వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర కంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కొన్ని సార్లు కంటిపై పొర కూడా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కొందరు మెడికల్‌షాపుకు వెళ్లి ఐడ్రాప్స్ తీసుకుని వినియోగిస్తున్నారు. దీనివల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇవి చేయాలి.. ట్రాఫిక్‌లో తప్పని సరిగా సరైన కళ్లద్దాలు ధరించాలి. బెక్లపై తిరిగేవారు హెల్మెట్, గాగుల్స్ ధరించడం మంచిది. ఏసీగదులు, స్క్రీన్ వాచింగ్ వల్ల నేత్ర సమస్యలు పెరుగుతాయి. దుమ్మూ,ధూళి వల్ల శ్వాసకోస వ్యాధులు, ముక్కుకు సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. -
ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవర్ నిర్మాణం
ఎంపీ కేశినేని నాని విజయవాడ(భవానీపురం) : రాజధాని అవసరాలు, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, ఏలూరు రోడ్ ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకే బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు, మేయర్ కోనేరు శ్రీధర్, జాతీయ రహదారుల రీజినల్ ఆఫీసర్ అనిల్ దీక్షిత్, పీడీ సురేష్, మేనేజర్ మధుసూదన్, విద్యావాణిలతో కలిసి ఆయన శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎంపీ మాట్లాడుతూ నగరంలో ప్రధాన కూడలి అయిన బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జ్యోతి కన్వెన్షన్ నుంచి స్టెల్లా కలాశాల జంక్షన్ వరకు సుమారు 618 మీటర్లకు బదులుగా మరో 820 అడుగులు పెంచి 1.4 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రమేష్ హాస్పటల్ సర్కిల్ వరకు పెంచడం వలన కేంద్రం నుంచి రూ.120 కోట్లు అదనంగా నిధులు సమీకరించాల్సి ఉందని చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నేషనల్ హైవే అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరొక నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో గుండుగొలను బైపాస్ రోడ్ ఏర్పాటు చేసినందున బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం స్టెల్లా కాలేజి వరకు సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రమేష్ హాస్పటల్ వరకు పొడగించాలని కోరుతూ గతంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారిని పలుమార్లు కలిశామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన నిధులను త్వరలో సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్(అన్న), డెప్యూటీ మేయర్ జి రమణారావు, కార్పొరేటర్లు సీహెచ్ గాంధీ, దేవినేని అపర్ణ, కె.రమాదేవి, జాస్తి సాంబశివరావు, నజీర్, సీనియర్ నాయకులు టి ప్రేమ్‌నాథ్, కె రామామరావు, తెలుగు మహిళ అధ్యక్షురాలు కె సూర్యలత పాల్గొన్నారు. -
సీఎం వద్దకు ద్విచక్ర ‘108’ ఫైలు
ఆమోదించిన వెంటనే నగర రోడ్లపైకి.. సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రద్దీతో కొట్టుమిట్టాడే హైదరాబాద్‌లో ద్విచక్ర ‘108’ అంబులెన్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ సంబంధిత ఫైలును సీఎం ఆమోదం కోసం పంపింది. ముందుగా 50 ద్విచక్ర అంబులెన్సులు అవసరమని ప్రతిపాదన పెట్టింది. ఒక్కో ద్విచక్ర వాహనానికి, దానికి అనుబంధంగా వైద్య పరికరాల కోసం రూ. 1.25 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ద్విచ క్ర వాహన కంపెనీలు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించారు. త్వరలో నగర రోడ్లపైకి ఈ ద్విచక్ర అంబులెన్సులు రానున్నాయని ఓ వైద్యాధికారి పేర్కొన్నారు. -
బోసిపోయిన బెజవాడ
సంక్రాంతి పండుగ సందర్భంగా జనమంతా పల్లె బాట పట్టారు.దీంతో బెజవాడనగరం బోసిపోయింది.రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీతో కిక్కిరిసి ఉండే బెజవాడ నగరం శనివారం బోసిపోయింది. వాహనాల హడావిడి నామమాత్రంగా కనపడింది. జనం రోడ్లపై పెద్దగా కనిపించలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని ప్రజలు తమ స్వస్థలాలకు తరలి వె ళ్లారు. పండుగ సెలవులు కావటంతో విజయవాడ నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నగరంలో సుమారు 12 లక్షల జనాభా ఉండగా దాదాపు మూడు లక్షల మంది తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల నుంచి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం నగరానికి వలస వచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి జనం వ్యాపారంతో బతుకు తెరువు కోసం నగరంలో జీవనం సాగిస్తున్నారు. వారంతా నగరం విడిచి వెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావటంతో ఉద్యోగులు కూడా బంధుమిత్రుల ఇళ్లకు, తీర్థయాత్రలకు తరలి వెళ్లారు. ఈ క్రమంలో రోడ్లపై జనసంచారం తగ్గింది. దీంతో ఆటోలు, సిటీ బస్సుల సంఖ్య కూడా మూడు రెట్లు తగ్గింది. కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా అంతగా కనపడలేదు. దీనికి తోడు నగరంలో వీఐపీల తాకిడి కూడా కనిపించలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ సొంత ఊళ్లకు పరిమితమయ్యారు. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, వైన్‌షాపుల వద్ద మాత్రం కొద్దిపాటి సందడి నెలకొంది. కోడిపందేలకు తరలి వె ళ్లిన జనం నగరంలో కోడిపందేలు, జూదం లేకపోవటంతో విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు జనం పయనమయ్యారు. కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కోడిపందేలు, జూదం ఆడేందుకు, వీక్షించేందుకు వందలాది కార్లలో పలువురు తరలివెళ్లారు. -
పెట్రో దడ
గురువారం నుంచి ‘పెట్రో’ నిరవధిక సమ్మె నేపథ్యంలో బుధవారం వాహనదారులకు దడ పట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా బంక్‌ల వద్ద వినియోగదారులు కిక్కిరిసిపోయారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకున్నారు. కొన్నిచోట్ల వాహనదారుల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె వంటి నగరాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద ద్విచక్ర వాహనదారులు వందల సంఖ్యలో గుమిగూడారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ రద్దీ నెలకొంది. -
బస్సు..జీపీఎస్సు
మనం ప్రయాణిస్తున్న సిటీ బస్సు గంటకు కిలోమీటరు దూరమైనా వెళ్లకపోవడం... ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడడం... ఆఫీసుకో... ఇంటికో... ఆలస్యంగా చేరుకోవడం... ట్రాఫిక్ పోలీసులను నిందించడం... నిత్యం నగరంలో ఎదురవుతున్న సమస్యే. ఈ సమస్య నుంచి బయట పడేందుకు అధికారులు యోచిస్తున్నారు. సిటీ బస్సు సాయంతోనే దీన్ని అధిగమించేందుకు యత్నిస్తున్నారు. - ‘సిటీబస్సు’తో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ - కంట్రోల్ రూమ్‌తో ఆర్టీసీ జీపీఎస్ అనుసంధానం - వాహన కదలికల ఆధారంగా గుర్తింపు - ప్రత్యేక కార్యాచరణకు ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధం సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సు ఇక ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వాహనాల రద్దీ నియంత్రణకు దిక్సూచిగా మారనుంది. బస్సు వేగం, కదలికల ఆధారంగా రోడ్లపై వాహనాల రద్దీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నగరంలో ప్రస్తుతం మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఓల్వో బస్సులను ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లోని జీపీఎస్‌తో అనుంధానించిన సంగతి తెలిసిందే. వీటిలో ఏర్పాటు చేసిన వెహికల్ మానిటరింగ్ యూనిట్స్ ఆధారంగా బస్సు కదలికలు నమోదవుతాయి. బస్సు ఎంత వేగంతో వెళుతోందో ఇట్టే తెలిసిపోతుంది. ఒకే సారి నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ జీపీఎస్ ఆధారిత బస్సుల కదలికలను బట్టి ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. రద్దీ తీవ్రంగా ఉంటే నివారించేందుకు... అవ సరమైన చోట వాహనాలను దారి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటారు. దీని కోసం ఆర్టీసీ రూపొందించిన జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయనున్నారు. కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు, ట్యాక్సీలు జీపీఎస్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ వాటి కదలికల ఆధారంగా ట్రాఫిక్ రద్దీని తె లుసుకోవడం సాధ్యం కాదని అధికారులు గుర్తించారు. ఆర్టీసీ జీపీఎస్‌లో మాత్రమే ప్రతి 10 సెకన్లకు బస్సు వేగాన్ని తెలుసుకునే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీనివల్ల వాహనాల రద్దీ తీవ్రతను కచ్చితంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులకు మాత్రమే పరిమితమైన జీపీఎస్‌ను దశల వారీగా ఆర్డినరీ సర్వీసులకు విస్తరించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. దీంతో పోలీసులు మరింత సమర్ధంగా ట్రాఫిక్ నియత్రణ చర్యలు తీసుకోగలుగుతారని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రద్దీ రూట్లపై ప్రత్యేక శ్రద్ధ రోజు రోజుకూ వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం గ్రేటర్లో 43 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం... మరోవైపు మెట్రో పనులతో అనేక మార్గాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఇరుకు రోడ్లతో వాహనాల సగటు వేగం దారుణంగా పడిపోయింది. కనీసం గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లవలసిన వాహనాలు పట్టుమని 10 కిలోమీటర్లు దాటడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణం మరింత నరకప్రాయంగా మారింది. రద్దీ తీవ్రంగా ఉన్న సమయాల్లో సిటీబస్సుల వేగం మరింత పడిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు వీటి వేగాన్ని, కదలికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్-తార్నాక-సికింద్రాబాద్, లకిడికాఫూల్-అమీర్‌పేట్-కూకట్పల్లి, ఎల్బీనగర్-దిల్సుఖ్నగర్-కోఠి వంటి మార్గాల్లో ఆర్టీసీ వినియోగిస్తున్న జీపీఎస్ ఆధారంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. -
ప్రారంభానికి ముందే ఆర్‌యూబీకి లీకులు
కొద్దిపాటి వర్షానికే లోపల నీరు నిల్వ అరండల్‌పేట : నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నిర్మించిన కంకరగుంట ఆర్యూబీ నాణ్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే పైకప్పు శ్లాబు నుంచి నీరు ఆర్యూబీ లోపలకు చేరుకుంది. లోపల నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. శ్లాబు లీకుల్లో నుంచి వస్తున్న నీరు వాహనచోదకులపై పడుతోంది. కంకరగుంట ఆర్యూబీ నిర్మాణానికి సుమారు రూ.13 కోట్ల వరకు వెచ్చించారు. ఏటీ అగ్రహారం, జూట్‌మిల్ వైపు అనుసంధాన పనులు నిర్వహించేందుకు అదనంగా కోటి రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆర్యూబీ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. వర్షం వస్తే లోపల నీరు నిల్వ ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. అయితే ఇంజినీరింగ్ అధికారులు చేపట్టిన పనులు కేవలం మాటలకే పరిమితమయ్యాయన్నది నిరూపితమైంది. అసలు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో వైపు కంకరగుంట ఆర్యూబీని అధికారికంగా ఈనెల 15న అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆర్యూబీని పరీక్షించేందుకు వాహనాల రాకపోకలకు అనుమతించారు. అయితే లోపల నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు భూగర్భంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. నీటిని తోడేందుకు మోటార్లు వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఆర్యూబీ ప్రారంభానికి ముందే ఇలా కావడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి లోపాలను సవరించాలని ఇంజినీరింగ్ అధికారులను కోరుతున్నారు. -
రహదారి రాజసం
ఎన్హెచ్ఏఐ చేతికి ఆనందపురం-అనకాపల్లి రహదారి విశాఖ సిటీలోని ఎన్‌హెచ్ రోడ్డు ఆర్ అండ్ బికి నగర ట్రాఫిక్ కష్టాల నుంచి కొంత ఉపశమనం విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు కొంతవరకు తెరపడనుంది. ప్రధానంగా నగరం గుండా వెళ్తున్న ఎన్.హెచ్16పై వాహనాల తాకిడి తగ్గిపోనుంది. ఎందుకంటే ఆనందపురం-అనకాపల్లి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)కు బదిలీ చేయనున్నారు. అనంతరం దాన్ని ఆరులేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఆనందపురం-అనకాపల్లి రోడ్డుకు విస్తరణ యోగం పట్టనుంది. ఆరులైన్లుగా విస్తరిస్తే అటు చెన్నై ఇటు కోల్కత్తా వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు, లారీలు, ఇతర వాహనాలు విశాఖ నగరంలోకి రానవసరం ఉండదు. ఇక విశాఖ నగరం గుండా వెళ్తున్న ఎన్.హెచ్16ను ఆర్ అండ్ బి శాఖకు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబా బు, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ(ఏపీఆర్డీసీ) ఎండీ జగన్నాథరావు బుధవారం విశాఖపట్నంలో పర్యటించి ఈమేరకు ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదించారు. ఇదీ ప్రణాళిక: ప్రస్తుతం విశాఖ నగరం గుండా జాతీయరహదారి వెళుతుండటంతో భారీ వాహనాల తాకిడి ఎక్కువుగా ఉంది. నగరంలోకి రానవసరంలేని భారీ వాహనాలు, లారీలు కూడా ఇలాగే వెళ్తున్నాయి. జాతీయ రహదారికి ప్రత్యమ్నాయంగా ఆనందపురం-అనకాపల్లిల మధ్య 46కి.మీ. పొడవున 36 నెంబర్ రాష్ట్ర రహదారిని నిర్మించారు. కానీ అది డబుల్‌లేన్ రోడ్డు కావడంతో పూర్తిస్థాయిలో ప్రయోజనాన్ని ఇవ్వలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రహదారిని ఎన్హెచ్ఏఐకి బదిలీ చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొంతకాలంగా చర్చల్లో నలుగుతున్న ఈ ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. ఆనందపురం-అనకాపల్లి రహదారిని తీసుకునేందుకు ఎన్హెచ్ఏఐ సమ్మతించింది. 48కి.మీ. పొడవైన ఈ రహదారిని తీసుకుని ఆరులేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 4లేన్లుగా ఉన్న చెన్నై-కోల్కత్తా ఎన్‌హెచ్ 16ను 6లేన్లుగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అందులో భాగంగానే ఆనందపురం-అనకాపల్లి రహదారిని అభివృద్ధి పరుస్తారు. అందుకు మొదట ఆ రహదారిని జాతీయ రహదారుల సంస్థకు అప్పగించాలి. అందుకోసమే రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాం బాబు, ఏపీఆర్డీసీ ఎండీ జగన్నాథరావు ఆర్ అండ్ బి అధికారులతో కలసి విశాఖపట్నంలో పర్యటించారు. ఆనందపురం-అనకాపల్లి రహదారితోపాటు విశాఖనగరం గుండా వెళ్తున్న ఎన్.హెచ్.16 మీద రోజుకు సగటున ప్రయాణిస్తున్న వాహనాల సంఖ్య, ఇతర గణాంకాలను తెలుసుకున్నారు. అనంతరం ఆనందపురం-అనకాపల్లి రహదారిని ఎన్హెచ్ఏఐకి అప్పగించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తికావచ్చని భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి ఆనందపురం-అనకాపల్లి రహదారిని ఎన్హెచ్ఏఐ పూర్తిస్తాయిలో అభివృద్ధి చేయనుంది. ఈ రహదారిని నాలుగు లేన్లుగా తీర్చిదిద్దాలని ఆర్ అండ్ బి అధికారులు ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదిస్తున్నారు. కానీ నిధుల లేమితో ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం మరింత నిధుల కటకట ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ రహదారి విషయాన్నే పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రహదారిని ఎన్హెచ్ఏఐకి అప్పగించాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. దాంతో ఆనందపురం-అనకాపల్లి రోడ్డు ఎన్.హెచ్.16లో భాగమవుతోంది. దాన్ని 6లేన్లుగా అభివృద్ధి చేసే ప్రక్రియను చేపడుతుంది. అందుకోసం అవసరమైన భూసేకరణ, ఇతరత్రా వ్యవహారాలన్నీ ఎన్హెచ్ఏఐ చూసుకుంటుంది. జిల్లాలోని ఆనందపురం-అనకాపల్లి రోడ్డునే మొదటగా 6లేన్లుగా అభివృద్ది చేయాలని భావిస్తోంది. ఆనందపురం-అనకాపల్లి రహదారికి ప్రత్యమ్నాయంగా ప్రస్తుతం విశాఖ నగరం గుండా వెళ్తున్న ఎన్‌హెచ్ 16ను ఆర్ అండ్ బి శాఖకు బదిలీ చేస్తారు. కాగా నగరం గుండా వెళ్తున్న ఈ రహదారిని జీవీఎంసీకి అప్పగించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలి. -
నో పార్కింగ్ జోన్‌గా మద్రాసు హైకోర్టు
అన్నానగర్: మద్రాసు హైకోర్టు సోమవారం వాహనాల రద్దీ లేకుండా ప్రశాంతంగా కన్పించింది. కారణం ఏమిటా అని ఆరా తీస్తే సెప్టెంబరు ఎనిమిదో తేదీ నుంచి మద్రాసు హైకోర్టును నో పార్కింగ్ జోన్‌గా అమలు చేయనున్నారని తెలిసింది. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులోకి కేవలం లాయర్లు - జడ్జిల వాహనాలను మాత్రమే అనుమతించారు. పిటిషనర్లూ - సందర్శకుల వాహనాలను లోనికి అనుమతించలేదు. కోర్టు క్యాంపస్ ఆవరణ ప్రహరీ గోడకు చేరువుగా సందర్శకులూ - పిటిషనర్లు తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చని కోర్టు వర్గాలు తెలిపాయి. రెండు నెలల పాటు ఈ అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని తెలిపాయి. రాత్రి 8 గంటల వరకూ న్యాయవాదులు, న్యాయమూర్తుల వాహనాలను కోర్టులోకి అనుమతిస్తామన్నారు. మద్రాసు బార్ అసోసియేషన్ ఈ మేరకు నిర్దిష్టమైన ప్రణాళికను అమలు పర్చనున్నట్లు తెలిపింది. కోర్టులోకి నిత్యం మూడు వేలకు పైగా వాహనాల రాకపోకలుంటాయని, ఇందువల్ల కోర్టులో కాలుష్యం స్థాయి పెరుగుతోందన్నారు. కోర్టు దక్షిణ గేటు క్యాంపస్, జ్యూడీషియల్ ఆఫీసర్స్ ప్రవేశ ద్వారం మెట్రో బస్టాండ్‌కు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలను కోర్టు ఉద్యోగుల వాహనాల పార్కింగ్ కోసం రిజర్వు చేశామన్నారు. ఎస్పన్లేడ్ గేటు, ఇండియన్ బ్యాంకు, మన్నేటిచోళన్ విగ్రహం 20 అడుగుల రోడ్డు, న్యూ అడ్వొకేట్స్ క్యాంటీన్, పాత లా ఛాంబరు వంటి ఆరు ప్రదేశాల ద్వారా మాత్రమే పిటిషన్ దార్లు, సందర్శకులు మద్రాసు హైకోర్టులోకి ప్రవేశించాల్సి ఉంటుందని మద్రాసు బార్ అసోసియేషన్ కార్యదర్శి వి.ఆర్.కమలనాధన్ తెలిపారు. -
‘మెట్రో’ రైలు రెడీ
సాక్షి, చెన్నై :నగరంలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే రీతిలో మెట్రో రైలు ప్రాజెక్టును సుమారు 15 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి జెమిని, సైదా పేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు 32.1 కి.మీ. దూరంలో ఓ మార్గం, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు మీదుగా వడపళని, గిండిలను కలుపుతూ సెయింట్ థామస్ మౌంట్ వరకు 22 కి.మీల దూరం మరో మార్గంలో మెట్రో రైలు సేవలకు నిర్ణయించారు. ఈ మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతూ వస్తున్నాయి. సెంట్రల్- కోయంబేడు - మౌంట్ మార్గంలో వంతెనల నిర్మాణం పూర్తి అయింది. ఈ మార్గంలో ఆలందూరు వరకు ట్రాక్ ఏర్పాటు పనులు ముగిశాయి. భూగర్భ మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో మార్గంలో వంతెన, భూగర్భ మార్గ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. బ్రెజిల్లో రూపుదిద్దుకున్న నాలుగు బోగీలను ఇక్కడికి తెప్పించి పనులు పూర్తి చేసుకున్న కోయంబేడు - ఆలందూరు మార్గంలో ట్రయల్ రన్ నిర్విహ స్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో శిక్షణ పొందిన డ్రైవర్లు ఓ రైలును నడుపుతున్నారు. నవంబర్ నుంచి ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ మార్గంలో ఒకే సమయంలో రెండు రైళ్లను నడిపే రీతిలో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెలలో మొదటి వారంలో ఆలందూరు నుంచి కోయంబేడుకు, కోయంబేడు నుంచి ఆలందూరుకు కొన్ని నిమిషాల వ్యవధుల్లో రెండేసి రైళ్లను నడిపేందుకు నిర్ణయించారు. ఈ మార్గంలో రైల్వే స్టేషన్ల ఏర్పాటు పనులు ముగింపు దశకు చేరాయి. అన్ని పనులు మరో నెలన్నర రోజుల్లో ముగియనున్న దృష్ట్యా, పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ మార్గంలో రైలు సేవలను అంకితం చేయడానికి మెట్రో ప్రాజెక్టు అధికారులు కసరత్లుల్లో పడ్డారు. అక్టోబరు మొదటి వారంలో నిపుణుల పరిశీలనానంతరం నవంబర్‌లో రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై ఆ ప్రాజెక్టు అధికారులు పేర్కొంటూ, కోయంబేడు - ఆలందూరు మార్గంలో పనులు ఇక ముగిసినట్టేనని వివరించారు. రైలు నడిపేందుకు ఈ మార్గంలో ఎలాంటి ఇబ్బందుల్లేవని, రైల్వే స్టేషన్ల పనులు మాత్రమే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మార్గంలో పనులు ముగియడంతో అక్టోబరులో నిపుణుల కమిటీ పరిశీలించి, ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగా నవంబర్ మొదటి వారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, నెలాఖరులో రైలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నెలాఖరులో అధికారికంగా మెట్రో రైలు ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నానగర్ - తిరుమంగళం మధ్య పనులు ముగింపు దశకు చేరాయని ప్రకటించారు. అలాగే, మరికొన్ని చోట్ల భూగర్భ పనులు శరవేగంగా సాగుతున్నాయి, భూగర్భ రైల్వే స్టేషన్ల పనులు ముగింపు దశకు చేరాయని వివరించారు. దీన్ని బట్టి చూస్తే 2015 నాటికి తొలి విడతగా మెట్రో రైలు నగరంలో పరుగులు తీయడం ఖాయం అన్నది స్పష్టం అవుతోంది. -
సేవకు సై
బెంగళూరుకు రైల్వే పథకాలు రెడీ దశల వారీగా అమలు చేస్తాం ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాం ఐదేళ్లలో సాధించబోయే ప్రగతిపై నివేదిక రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరానికి అవసరమైన రైల్వే పథకాల జాబితాను సిద్ధం చేశామని రైల్వే శాఖ మంత్రి డీవీ. సదానంద గౌడ తెలిపారు. అధికారులతో చర్చించి ఈ పథకాలను దశలవారీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో బెంగళూరు ఉత్తర నియోజక వర్గం కార్యకర్తలు శనివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో సన్మానాన్ని స్వకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అవసరమైన సర్క్యూట్ రైలు సహా వివిధ పథకాలను చేపట్టడానికి చర్యలు చేపడతానని భరోసా ఇచ్చారు. ఐదేళ్లలో తాము సాధించబోయే ప్రగతిని నివేదిక రూపంలో ప్రజలకు అందజేస్తామని చెప్పారు. రైల్వే మంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శనంలో ముందుకు సాగుతానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు తనపై ఉంచిన ప్రేమానురాగాలను కాపాడుకుంటానని, చెడ్డ పేరు రాకుండా మసలుకుంటానని తెలిపారు. తనను అభినందించడానికి పూలహారాలు, తల పాగాలు తీసుకు రావద్దని కార్యకర్తలను కోరారు. కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విధాన సౌధ సమీపంలోని విశ్వేశ్వరయ్య టవర్స్‌లో తన కార్యాలయం ఉందని, కార్యకర్తలు అక్కడికి వచ్చి తన ద్వారా జరిగే పనులను చేయించుకోవచ్చని ఆయన సూచించారు. సర్కారు పతనం తథ్యం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఏ క్షణంలోనైనా పతనం కావచ్చని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ జోస్యం చెప్పారు. అభినందన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పరిస్థితి బాగా లేదని, కనుక కార్యకర్తలు మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, హోం శాఖ మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పోలీసు శాఖలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. పోలీసు అధికారుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. -
వాన.. హైరానా..!
-
మరో 4 ఫ్లై ఓవర్లు
సనత్‌నగర్, న్యూస్‌లైన్ : సిటీలో మరో నాలుగు ఫ్లైఓవర్లు రానున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కారిడార్‌లోని కీలక జంక్షన్లలో నిర్మించే వీటికి ఆర్థికసాయం హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్ఎంఆర్) సంస్థ చేస్తుండగా... నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) చేపడుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా అంచనాలు, నివేదికలు తయారు చేసేందుకు సంస్థను ఎంపిక చేయడానికి ఆర్ అండ్ బీ సీల్డ్ టెండర్లను ఆహ్వానించింది. వీటి దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. నగరంలో ఉన్న ప్రధాన, కీలక జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ, జామ్స్‌ను తగ్గించేందుకు సమాయత్తమైన హెచ్ఎంఆర్ అధికారులు ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, నివేదికలు పక్కాగా రూపొందించేందుకు సమర్థమంతమైన సంస్థ కోసం అన్వేషణ ప్రారంభించారు. దీనికోసం సీల్డ్ బిడ్స్ ఆహ్వానిస్తూ ఆర్ అండ్ బీ రూరల్ సర్కిల్ ఇటీవలే టెండర్ నోటీసు జారీ చేసింది. పనుల తీరిదీ... సంస్థల నుంచి సేకరించిన బిడ్స్ పరిశీలన అనంతరం ఆమోదం పొందిన వాటికి ఈపీసీ ద్వారా పనులు అప్పగించాలి. ముందుగా ఆయా ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారనే దానిపై ఆయా కన్స్ట్రక్షన్ సంస్థల నుంచి టెక్నికల్ బిడ్, ఎంత వ్యయంలో పూర్తి చేస్తారనే అంశంపై ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానిస్తారు. ఇదే క్రమంలో ఆయా సంస్థలకున్న అనుభవం, గతంలో అవి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలకూ ప్రాధాన్యం ఇస్తూ పరిగణన లోనికి తీసుకుంటారు. ఆయా నిర్మాణ సంస్థల నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణానికి తయారు చేసిన మూడు నాలుగు రకాల ప్లాన్లను పరిశీలించి ఉత్తమమైనది ఎంపిక చేస్తారు. ఈ డిజైన్‌తో పాటు ఇతర అంశాలనూ ఆర్ అండ్ బీ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ ఆమోదం కోసం పంపిస్తారు. ఇదంతా టెక్నికల్ బిడ్‌లో ఉంటుంది. ఈ టెక్నికల్ బిడ్‌కు ఆమోదముద్ర పడిన తరవాత ఆర్థికపరమైన అంశాలతో కూడిన ఫైనాన్షియల్ బిడ్స్‌ను తెరుస్తారు. ఎవరైతే తక్కువ ఖర్చు కోట్ చేసినవారికి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాజెక్టును అప్పగిస్తారు. సోమవారం ప్రారంభమైన బిడ్స్ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగించి, అదే రోజు టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేస్తారు. దరఖాస్తు ఫారాలు బల్కంపేట్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో లేదా (aproads.cgg.gov.in) వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. వీటిని పూర్తి చేసి బల్కంపేట్‌లోని కార్యాలయంలో సమర్పించాలి.