18న సగం సిటీకి నీళ్లు బంద్‌ | 18th half of the city, water shutdown | Sakshi
Sakshi News home page

18న సగం సిటీకి నీళ్లు బంద్‌

Published Fri, Oct 14 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

18న సగం సిటీకి నీళ్లు బంద్‌

18న సగం సిటీకి నీళ్లు బంద్‌

సాక్షి, సిటీబ్యూరో : కృష్ణా ఫేజ్‌–3 పైపులైన్లకు ముందస్తు మరమ్మతుల కారణంగా ఈనెల 18న (మంగళవారం) నగరంలో పలు ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. దీంతో బీఎన్‌ రెడ్డినగర్, ఎల్బీనగర్, ఆటోనగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అల్కాపురి, దిల్‌సుఖ్‌నగర్, ఆర్‌జీకె. బండ్లగూడ, బాలాపూర్, బాబానగర్, రియాసత్‌నగర్, బార్కాస్, డీఆర్‌డీఎల్, డీఎంఆర్‌ఎల్, మిధాని, చాంద్రాయణగుట్ట, ఉప్పల్, బీరప్పగడ్డ, కైలాస్‌గిరీ, ఎన్న్ఎఫ్‌సీ, మైలార్‌దేవ్‌పల్లి, మధుబన్, పీడీపీ, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడీ, అత్తాపూర్, చింతల్‌మెట్, బుద్వేల్,మెహిదీపట్నం, కార్వాన్‌, లంగర్‌హౌజ్, కాకతీయనగర్, హుమయూన్‌ నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్‌నగర్, ఎంఈఎస్, గంధంగూడ, ఓయూకాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయనగర్‌కాలనీ, రెడ్‌హిల్స్, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్, నాంపల్లి, లక్డికాపూల్, సెక్రటేరియట్, జియాగూడ, ఆళ్లబండ, గోడెఖీఖబర్, ప్రశాసన్‌ నగర్, గచ్చిబౌలి, లాలాపేట, చాణక్యపురి, గౌతంనగర్‌ ప్రాంతాలకు నీటిసరఫరా ఉండదని ప్రకటించింది. మరమ్మతులు పూర్తయిన 12 గంటల్లోగా సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement