2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి | 2013 Land Acquisition Act to be implemented | Sakshi
Sakshi News home page

2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి

Published Sat, Jun 18 2016 3:35 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి - Sakshi

2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్‌ల కింద భూముల సేకరణను 2013 భూసేకరణ చట్టం ప్రకారమే చేపట్టాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర అధికారప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు మాట్లాడారు.  ముంపు గ్రామాల రైతులకు ప్రతి ఎకరాకు రూ. 25 లక్షలు, కులవృత్తులవారికి రూ.10 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ రేటుకు నాలుగింతలు పెంచి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇంటికి నలుగురు పోలీసులను పెట్టి  జీవో 123 ప్రకారం వెళ్తానంటే ప్రజలు, రైతుల ప్రతిఘటనను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో టాటా భూముల విషయంలో సీపీఎం వారు ఇలాగే వ్యవహరించి చేతులు కాల్చుకున్నారని గుర్తు చేశారు. తన జిల్లా నుంచే ప్రతిఘటన ఆరంభం కాకుండా సీఎం కేసీఆర్ చూసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ కేవలం సిద్ధిపేట్, గజ్వేల్, తన ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు నీరు తరలించేందుకు రీడిజైన్ నాటకం తెర మీదకు తీసుకువచ్చారన్నారు. 25 వేల ఎకరాల బంగారు భూమిని, 14 గ్రామాలను నీట ముంచుతున్నారని వాపోయారు. 16 వేల జనాభా నిరాశ్రయులు కానున్నారని చెప్పారు. దుబ్బాక ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో భూములు ముంపునకు గురవటం గురించి మధనపడుతున్నారని తెలిపారు.  ముంపు గ్రామాల ప్రజలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. అవసరమైతే ఆందోళన చేసే పార్టీలతో, సంఘాలతో కలసి ముందుకు సాగుతుందన్నారు.

 రేవంత్...బాబు వ్యభిచారం కన్పించలేదా
 వివిధ పార్టీల ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవటం వ్యభిచారం అయినప్పుడు, ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అక్కడి సీఎం చంద్రబాబు నాయుడు కోటానుకోట్లు ఎర చూపి లాగేసుకోవటం వ్యభిచారంగా కన్పించలేదా అని రేవంత్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. టీడీపీ రెండు నాల్కల ధోరణి విడనాడాలని సూ చించారు. ఇరురాష్ట్రాల సీఎంలు ఇలాగే వ్యవహరిస్తూ వెళ్తే, మున్ముందు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement