భార్య మృతదేహంతో 60 కి.మీ.! | 60 km by walk with wife's dead body | Sakshi
Sakshi News home page

భార్య మృతదేహంతో 60 కి.మీ.!

Published Sun, Nov 6 2016 3:17 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

భార్య మృతదేహంతో 60 కి.మీ.!

భార్య మృతదేహంతో 60 కి.మీ.!

 - కాలినడకన ప్రయాణించిన ఓ భర్త
 - సొంతూరు వెళ్లేందుకు డబ్బుల్లేకపోవడంతో శవాన్ని చక్రాల బండిపై వేసుకుని ప్రయాణం
 
 అనంతగిరి/మనూరు: జీవిత సహచరి కన్నుమూసిందన్న బాధను గుండెల్లో నింపుకొని ఆమె శవంతో దాదాపు 60 కి.మీ. నడిచాడు ఓ భర్త! సొంతూరు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో చక్రాల బండిపై మృతదేహాన్ని ఉంచి తోసుకుంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో కొందరు ఆపన్నహస్తం అందించడంతో చివరకు అంబులెన్స్‌లో సొంతూరికి చేరుకున్నాడు. అందరి హృదయాలను ద్రవింపజేసిన ఈ ఘటన శనివారం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

 బీదర్ నుంచి వచ్చి..
 సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మారుుకోడ్‌కు చెందిన రాములు(53), కవిత(45) దంపతులు. ఇద్దరూ కుష్టువ్యాధితో బాధపడుతున్నారు. ఊరి వదిలి బతుకుతెరువు కోసం వీరు వేరే ప్రాంతాలకు వెళ్లారు. కొంత కాలంగా కర్ణాటకలోని బీదర్ రైల్వే స్టేషన్  పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించారు. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినెలా యాచకులకు నాలుగైదు కిలోల బియ్యం ఇస్తుందని తెలుసుకున్న ఈ దంపతులు... శుక్రవారం రాత్రి బీదర్ నుంచి షిర్డీ ఇంటర్‌సిటీ రైల్లో వచ్చి లింగంపల్లి స్టేషన్ లో దిగారు. ఉదయం చాయ్ తాగి మౌలాలికి వెళ్లేందుకు రాములు సిద్ధమయ్యాడు. అంతలోనే భార్య కవిత అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచింది. కళ్లముందే భార్య చనిపోవడంతో రాములు కన్నీరుమున్నీరయ్యాడు.

శవాన్ని తీసుకువెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. అయినా భార్యకు సొంతూరిలో అంత్యక్రియాలు చేయాలని రాములు భావించాడు. ఓ యాచకుడి వద్ద చక్రాలతో కూడిన ఓ తోపుడు బండి తీసుకున్నాడు. దానిపై భార్య మృతదేహాన్ని ఉంచి మారుుకోడ్‌కు బయల్దేరాడు. హైదరాబాద్ నుంచి కాలినడకన దాదాపు 60 కి.మీ. ప్రయాణించి వికారాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడికి రాగానే కొందరు రాములు దీనస్థితిని తెలుసుకొని స్పందించారు. సమాచారం అందుకున్న సీఐ రవి అక్కడికి చేరుకున్నారు. అంగీకరిస్తే మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేసే ఏర్పాటు చేస్తానని చెప్పగా అందుకు రాములు ఒప్పుకోలేదు. సొంతూరిలో అంత్యక్రియలు చేస్తానని దీనంగా చెప్పాడు. దీంతో అక్కడున్న కొందరు తోచిన సాయం చేశారు. సీఐ రవి.. స్వామివివేకానంద సేవా సమితి అంబులెన్ ్స ద్వారా రాములును సొంతూరికి పంపారు. సాయంత్రం 7 గంటలకు ఆయన స్వగ్రామానికి చేరుకున్నాడు. సొంతూరిలో రాములుకు ఇల్లు కూడా లేదు. వీరు ముగ్గురు అన్నదమ్ములు. పెద్దన్న మరణించాడు. ఇంకో అన్న ఇంటి వద్దే పొలం చూస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement