ప్రాజెక్టులపై విపులంగా చర్చించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో విపులంగా చర్చించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేసి జల విధానానికి రూపకల్పన చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో అధికారపార్టీ బలం పెరిగిందని, అన్ని ఎన్నికల్లో గెలుస్తున్నామనే అహంభావపూరిత ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణ అంచనా వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెరిగిందన్నారు. చర్చ లేకుండా తడికెపల్లి, పాములపర్తి వద్ద రిజర్వాయర్ల సామర్థాన్ని ఆగమేఘాల మీద 20, 50 టీఎంసీలకు పెంచడమేంటని ప్రశ్నించారు.