లబ్ధిదారుల ఎంపిక వేగిరం
డబుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారైన ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో జాప్యం ఉండొ ద్దన్నారు. ఈ పథకంలో 50,959 ఇళ్ల నిర్మా ణానికి మొదట విడతలో ప్రధాని ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.190.66 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లు, రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు పనితీరుపై బుధవారం ఆయన సమీక్ష జరిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోందని, కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతున్నారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 94,250 ఇళ్ల నిర్మాణానికి పాలనపరమైన అనుమతులు వచ్చా యని, 83,087 ఇళ్లకు టెండర్లు పిలవగా 41,925 ఇళ్లకు ఖరారైనట్లు చెప్పారు.
ప్రస్తుతం 20,986 ఇళ్ల పనులు కొనసాగు తున్నాయని, 1,629 ఇళ్లు సిద్ధమయ్యాయని వివరించారు. ఇప్పటివరకు రూ.202.85 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గృహ నిర్మాణ మండలి రూ.1,066.94 కోట్లతో చేపట్టే 13 ప్రాజెక్టులకు త్వరగా డిమాండ్ సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కూకట్‌పల్లిలోని 200 ఎంఐజీ ప్లాట్ల నోటిఫికే షన్‌కు స్పందన రానందున మరోసారి డిమాండ్ సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు.
హౌసింగ్ బోర్డు ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన రూ.207.98 కోట్ల బకాయిలను వసూలు చేయాలని ఆదేశిం చారు. జేఎన్‌టీయూకు లీజుకిచ్చిన భూమి లో కొంతభాగం ఓ ప్రైవేటు సొసైటీ ఆక్ర మణలో ఉందని, దాన్ని స్వాధీనం చేసుకోవా లని ఆదేశించారు. లీజు గడువు ముగిసిన వాటి వివరాలను అందజేయాలన్నారు. జేఎన్‌టీయూ చెల్లించాల్సిన రూ.10.53 కోట్ల లీజు రెంట్‌కు సంబంధించి ఆ వర్సిటీ వీసీ, ఉన్నత విద్యా శాఖ మంత్రి, స్పెషల్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.