‘డబుల్’ ఇళ్లకు రూ.230కే బస్తా సిమెంటు
‘డబుల్’ ఇళ్లకు రూ.230కే బస్తా సిమెంటు
Published Fri, Nov 25 2016 3:18 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.230కే బస్తా సిమెంటును సరఫరా చేయ డానికి 32 సిమెంటు కంపెనీలు అంగీకరిం చాయి. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో ముఖ్యకార్యదర్శి అశోక్‌కుమార్‌తో సిమెంటు కంపెనీల ప్రతిని ధులు గురువారం అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంటు, స్టీలు, ఇసుక వంటివి తక్కువ ధరకు అందించాలని సిమెంటు కంపెనీలను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సిమెంటు బస్తాను తక్కువ ధరకే అందించడానికి 32 సిమెంటు కంపెనీలు ముందుకొచ్చారుు.
నిర్మాణం ఇక వేగవంతం...
రాష్ట్ర ప్రభుత్వానికి, సిమెంటు కంపెనీలతో ఒప్పందం జరిగిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సిమెంటును సరఫరా చేసిన వారంరోజుల్లో కంపెనీలకు బిల్లులను చెల్లిస్తామని చెప్పారు. సిమెంటు సరఫరా, చెల్లింపుల్లో ఏమైనా సమస్యలు తలెత్తినా పరస్పర అవగాహనతో, చర్చలతో పరిష్కరించుకుంటామన్నారు. సిమెంటు కంపెనీలతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం అవుతుందని ఇంద్రకరణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మా ణానికి నిధుల సమస్య లేదని, రుణం ఇవ్వ డానికి హడ్కో ఇప్పటికే ముందుకు వచ్చిం దన్నారు. సబ్సిడీ ధరకు వస్తున్న సిమెంటు పక్కదారి పట్టకుండా కఠినమైన, పటిష్టమైన చర్యలను తీసుకుంటా మని ఇంద్రకరణ్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకోసం సరఫరా చేస్తున్న సిమెంటుపై ప్రత్యేకమైన చిహ్నాలను ముద్రిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 32 సిమెంటు కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement