సికింద్రాబాద్ బస్టాప్ లో తప్పిన ప్రమాదం
Published Wed, Nov 30 2016 3:27 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని 31వ నెంబర్ బస్ స్టాప్‌లో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ వాహనం ఢీకొని భారీ విద్యుత్ స్తంభం నేలకొరిగింది. అదృష్టవశాత్తూ స్తంభం పడిన చోట జనాలు ఎవరూలేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఓ ఆటో ధ్వంసమైంది. ఆర్టీసీ సిబ్బంది స్తంభాన్ని రోడ్డు పక్కను లాగేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడలేదు.
Advertisement
Advertisement