
వారి నుంచి ప్రాణహాని ఉంది: సినీనటి పూజిత
హైదరాబాద్: తన భర్త విజయ్గోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నుంచి ప్రాణహాని ఉందని సినీ నటి పూజిత ఆరోపించింది. మంగళవారం ఆమె ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.
విడాకులివ్వకుండానే తన భర్త రేఖారాణిని వివాహం చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన ఐడీ ఫ్రూవ్, ఇతర వివరాలను పోలీసులకు సమర్పించినట్లు తెలిపింది. తన కుమారుడికి, తనకు న్యాయం జరిగేలా చూడాలని పూజిత కోరింది.