సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రీపెయిడ్ క్యాబ్స్‌చార్జీలను సవరిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో వెలువరించింది. పెరిగిన ధరలు, డ్రైవర్ల జీతభత్యాలు, విడిభాగాల ఖర్చులు, తదితర నిర్వహణ భారాలను దృష్టిలో ఉంచుకొని చార్జీలను స్వల్పంగా పెంచినట్లు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ తెలిపారు. కొత్తగా సవరించిన చార్జీల ప్రకారం పగటిపూట కిలోమీటర్‌కు రూ.17, రాత్రిపూట రూ.20 చొప్పున చార్జి ఉంటుంది.
ఈ చార్జీలకు రూ.30లు అదనంగా సర్వీస్ చార్జి చెల్లించాలి. క్యాబ్స్ 8 ఏళ్లలోపువై ఉండాలి. 1000 సీసీ కెపాసిటీ కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగి ఉండాలి. లగేజీపైన రూ.20 కంటే ఎక్కువ తీసుకోకూడదు. క్యాబ్ డ్రైవర్లు తెల్లని యూనిఫామ్ ధరిం చాలి. మాతృభాషతోపాటు ఇంగ్లిష్‌లో మాట్లాడగలగాలి. డ్రైవింగ్ లెసైన్స్, పర్మిట్ వివరాలను కార్ల లో ప్రదర్శించాలి. బీఎస్‌ఎన్‌ఎల్ టోల్‌ఫ్రీ నంబర్ ‘1074’ కారుకు నాలుగువైపులా ప్రదర్శించాలి. ‘ప్రీపెయిడ్ ట్యాక్సీ’ అనే బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ క్యాబ్‌లలో 50 శాతం.. విమానాశ్రయ నిర్మా ణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులవై ఉండాలి. మిగతా 50 శాతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు పాటించాలి.
ఎయిర్‌పోర్టు ప్రీపెయిడ్ క్యాబ్స్ చార్జీల సవరణ
Published Sat, Jun 11 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM
Advertisement
Advertisement