హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రెండో విడత ప్రవేశ పరీక్ష ఈ నెల 30న నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 వరకు ఆఖరి గడువని పేర్కొన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందు హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.