సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విమానయాన సంస్థ ఆవిర్భవించింది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ పేరును తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు) కె.ప్రదీప్‌చంద్ర గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ అకాడమీ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఉపాధ్యక్షుడిగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆర్థికశాఖ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శులతోపాటు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్- ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, ఎన్‌సీసీ డిప్యూటీ డెరైక్టర్ జనరల్, కేంద్ర విమానయాన సంస్థ ప్రతిపాదించే అధికారులు ఉం టారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
టీ.విమానయాన సంస్థ ఆవిర్భావం
Published Fri, Aug 22 2014 2:49 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM
Advertisement
Advertisement