
కృష్ణాలో ఏపీకి 155 టీఎంసీలు చాలు
► గుండూరు ఛానల్‌కు 4 టీఎంసీలున్నా, వాస్తవ అవసరాలు 1.48 టీఎంసీలకు మించవు.
► సాగర్ ఎడమ కాల్వల కింద వారికి 34.25 టీఎంసీల కేటాయింపుల్లో వాస్తవ అవసరాలు 20.22 టీఎంసీలే. అయితే అమరావతి రాజధాని కింద 3.05లక్షల ఎకరాలు ప్రభావితం అవుతున్నందున ఈ నీటి కేటాయింపులు కూడా అవసరం లేదు.
► సాగర్ కుడి కాల్వ కింద 140 టీఎంసీల కేటాయింపులు ఉండగా, వాస్తవ అవసరాలు 75.57 టీఎంసీలు మాత్రమే. ఇందులోనూ కుడి కాల్వ పరిధిలోని 2.67లక్షల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఉన్నందున 26.71టీఎంసీలను తగ్గించి 75.77 టీఎంసీలు కేటాయిస్తే సరిపోతుంది.
► తుంగభద్ర లోలెవల్ కెనాల్, హై లెవల్ కెనాల్‌ల కింద అవసరాలకు మించి కేటాయింపులున్నాయి. వాటిని తగ్గించాలి.
► మొత్తంగా 512 టీఎంసీల నికర జలాల కేటాయింపులను 155.40 టీఎంసీలకు పరిమితం చేయాలి.
► ఇక తెలంగాణకు కృష్ణా బేసిన్‌లో 68.5శాతం పరివాహకం ఉండగా కేటా యింపులు మాత్రం 36.9 శాతమే. అదే ఏపీకి 31.5శాతం పరివాహకం ఉన్నా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 351 టీఎంసీలు ఏపీ బేసిన్ బయటే వాడుకుంటోందని తెలిపింది. బేసిన్ పరివాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణలో 36.5లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో కేవలం 15.03లక్షల హెక్టార్లు ఉంది. జనాభా పరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో 78.29లక్షలు(28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే 811 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీల వరకు దక్కాలి.