సాక్షి, హైదరాబాద్: ‘సేవా దృక్పథం, సమాజ శ్రేయస్సే సంకల్పం’ అనే నినాదంతో కొత్తగా ఏర్పడ్డ అమెరికా తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు హాజరయ్యారు. పలు సంఘాల్లో ఇప్పటికే క్రియాశీలంగా ఉన్న సభ్యులు సైతం కొత్త అసోసియేషన్‌ను స్వాగతిం చారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా, సరికొత్త ఆలోచనలతో సేవ చేయాలనే దృక్పథంలో ఆటా స్థాపించినట్లు సంఘ ప్రతి నిధులు తెలిపారు. అందరి సహకారం, సమన్వయంతో త్వరలోనే అమెరికాలో ప్రపంచ తెలంగాణ మహాసభలు నిర్వహిస్తామన్నారు.
అసోసియేషన్ ఏర్పాటును ఆహ్వానిస్తూ తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, నిజామాబాద్ ఎంపీ కవిత, ఎంపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ వీడియో మెసేజ్ ద్వారా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారైలు రామ్మోహన్ కొండా, మహేశ్ తన్నీరు, నర్సింహారావు, నాగులవంచ, రాజ్ చిదేళ్ల, చందు తల్ల, రఘువర్మ, విష్ణు మాధవరం, లోకేశ్, సత్య కందిమళ్ల తదితరులు పాల్గొన్నారు.
అమెరికాలో ఘనంగా ఆటా వేడుకలు
Published Mon, Mar 14 2016 4:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement