హైదరాబాద్ బర్డ్ రేస్ అంటే... పక్షుల పరుగు పందెం కాదు. పక్షులను చూసేందుకు మనుషులు పెట్టే పరుగు. 2005 ఫిబ్రవరి 27న వందమంది పక్షి ప్రేమికులు ముంబైలో ఒక్కచోటకి చేరారు. చుట్టూ ఉన్న ప్రాంతంలో 277 జాతుల పక్షులను గుర్తించారు. అదే ఇండియా బర్డ్‌రేస్‌కి నాంది అయింది.
అన్ని రకాల పక్షులను చూడటం, అంతరించిపోతున్న పక్షి జాతులను ఈ తరానికి పరిచయం చేయడం, పర్యావరణ పరిరక్షణ ఈ రేస్ ధ్యేయం. ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు దేశంలోని 16 నగరాల్లో ఈ ఈవెంట్‌ను కండక్ట్ చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో ఏపీ బర్డ్ వాచర్స్ సొసైటీ (బీఎస్‌ఏపీ), గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ (జీహెచ్‌ఏసీ), యుహీనా ఇకో-మీడియా, హెఎస్‌బీసీ పాల్గొంటున్నాయి. మన రాష్ట్రంలో బర్డ్ వాచర్స్ సొసైటీ 1980లో ఏర్పడింది. పక్షుల గురించి అవగాహన పెంచడమే దీని లక్ష్యం.
ఎంటర్‌టైన్‌మెంట్.. ఎడ్యుకేషన్
అందరికీ ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి నెలా ఒక ట్రిప్ కండక్ట్ చేస్తున్నాం. పెద్దవారితో పాటు పిల్లలూ వస్తున్నారు. వారికి వి షేర్ ది ప్లానెట్ విత్ ఆల్ అనే మెసేజ్ ఇస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎడ్యుకేషన్ కూడా. ఎవరైనా రావచ్చు.. నేర్చుకోవచ్చు. ఏటా జనవరిలో రెండు రాష్ట్రాల్లోని కొలనులు, నదుల్లో నీళ్లపై ఆధారపడి ఉండే పక్షులను లెక్కిస్తున్నాం. ఈ ఫిగర్స్‌ను నెదర్లాండ్స్‌లో వెట్‌ల్యాంట్ ఇంటర్నేషనల్‌కు పంపిస్తాం. ఆ లేక్ హెల్త్ ఎలా ఉందనేది వాళ్లు పరీక్షించి చెబుతారు. మొత్తంగా ఇదోరకం పర్యావర ణ పరిరక్షణ... అని చెప్పారు బీఎస్‌ఏపీ సభ్యురాలు సురేఖ అయితాబత్తుల.
బర్డ్ రేస్...
Published Sat, Feb 7 2015 11:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement