అమిత్‌ షాపై జైపాల్‌ వ్యాఖ్యలు అనుచితం | bjp leader laxman speaks over jaipal comments over amit shah | Sakshi
Sakshi News home page

అమిత్‌ షాపై జైపాల్‌ వ్యాఖ్యలు అనుచితం

Published Mon, Nov 7 2016 2:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:11 PM

అమిత్‌ షాపై జైపాల్‌ వ్యాఖ్యలు అనుచితం - Sakshi

అమిత్‌ షాపై జైపాల్‌ వ్యాఖ్యలు అనుచితం

సాక్షి,హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు.

అమిత్‌షా గురించి కానీ, బీజేపీ గురించి కానీ మాట్లాడే అర్హత జైపాల్‌రెడ్డికి లేదని పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. గల్లీ నాయకులెవరో ప్రజలకు తెలుసు కాబట్టే  కాంగ్రెస్‌ నేతలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని ఎద్దేవా చేశారు. గల్లీకి ఢిల్లీకి తేడా తెలియని జైపాల్‌ రెడ్డి అమిత్‌షాపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. నెహ్రూ కుటుంబ చరిత్రను మినహా.. ఏనాడైన జాతీయ నాయకులైన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, సుభాష్‌ చంద్రబోస్, బీఆర్‌ అంబేద్కర్, పీవీ నరసింహారావు వంటి మాహానుభావుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారా.. అని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement