'మోదీ నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి' | BJP Minority Morcha felicitated Dattatreya | Sakshi
Sakshi News home page

'మోదీ నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి'

Published Sun, Nov 30 2014 4:25 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

బండారు దత్తాత్రేయ - Sakshi

బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్నివర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. బీజేపీ మైనార్టీ మోర్చా అధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటుందని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ 2019లో ముస్లిం ఓట్లతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అండగా నిస్తున్నారని చెప్పారు.

బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ శాసనసభలో బీజేపీ నిర్మిణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించిందన్నారు. తప్పులు బయటపడతాయే కాంగ్రెస్ టీఆర్ఎస్తో రాజీపడిందని విమర్శించారు. శాసనసభ వేదికగా ప్రజా సమస్యలను బీజేపీ వినిపించగలిగిందని చెప్పారు. కేంద్ర నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఢిల్లీ వెళ్లడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement