హైదరాబాద్: కోట్లాది రూపాయల మేర మోసానికి పాల్పడిన కేసులో ఓ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. వీఎం కోలాజిక్స్ అనే సంస్థకు కె.వెంకటరామ విద్యాసాగర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2011-12 సంవత్సరాల కాలంలో ఆయన జింపెక్స్ అనే సంస్థ నుంచి ఈయన రూ.9.14 కోట్ల విలువైన బొగ్గును కొనుగోలు చేశారు. ఆ బొగ్గును కె.వెంకటరామ విద్యాసాగర్ వేరొకరికి అమ్మేశారు. కానీ, జింపెక్స్ సంస్థకు డబ్బు మాత్రం పూర్తిగా చెల్లించలేదు. పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 నుంచే విద్యాసాగర్ తప్పించుకు తిరుగుతున్నారు. దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.