హైదరాబాద్ : సోమవారం సాయంత్రం రెండు గంటల పాటు కేబుల్ టీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జగదీశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. బ్రాడ్‌కాస్టర్లు, ఎంఎస్‌ఓల బలవంతపు ఫీజు వసూళ్ల ఒత్తిడి తట్టుకోలేక బీరంగూడ కేబుల్ ఆపరేటర్ రమేశ్ ఆత్మహత్య చేసుకున్నందుకు నిరసనగా ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు.