ముందస్తుకు పోతే కేసీఆర్‌కూ బాబు గతే | Cada Venkata Reddy about KCR | Sakshi
Sakshi News home page

ముందస్తుకు పోతే కేసీఆర్‌కూ బాబు గతే

Published Mon, Oct 24 2016 1:27 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

ముందస్తుకు పోతే కేసీఆర్‌కూ బాబు గతే - Sakshi

ముందస్తుకు పోతే కేసీఆర్‌కూ బాబు గతే

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సర్వేల వాపును చూసి బలుపని భ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, పొరపాటున ముందస్తు ఎన్నికలకు వెళితే గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మఖ్దూం భవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పార్టీ నిర్మాణంపై సీపీఐ పార్టీ దృష్టి సారించిందని చెప్పారు.

నవంబర్ 3 నుంచి 23 వరకు జిల్లాల వారీగా నిర్మాణ మహాసభలు నిర్వహించి, నవంబర్ 28 నుంచి 30 వరకు వరంగల్‌లో రాష్ట్ర పార్టీ నిర్మాణ మహాసభలను నిర్వహించాలని కార్యదర్శివర్గ సమావేశం నిర్ణయించిందన్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదమేర్పడిందని, కృష్ణా జలాలపై హక్కులను సాధించుకునేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సహాయ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement