కీసర: రంగారెడ్డి జిల్లా కీసర ఔటర్ రింగు రోడ్డు వద్ద సర్వీసు రోడ్డులో కారు దగ్ధమైంది. కీసర నుంచి కుషాయిగూడ వెళ్తుండగా కారు ముందు భాగంలో పొగలు రావడంతో రోడ్డుపైనే నిలిపేశారు. కాసేపయిన తర్వాత అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మంటలు వ్యాపించక ముందే కారు దిగడంతో అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.