సాక్షి టీవీ చిట్ చాట్ లో బండ్ల గణేష్, పూరీ జగన్నాథ్
హైదరాబాద్: సూపర్ డూపర్ హిట్ టాక్తో నడుస్తున్న 'టెంపర్' సినిమాకు పూరి జగన్నాథే దర్శకుడని ఆ చిత్రం నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. ఆదివారం రాత్రి గణేష్తోపాటు సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ సాక్షి టీవీలో మాట్లాడారు. 'టెంపర్' చిత్రాన్నిమిగిలిన దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా నిర్మిస్తామని గణేష్ చెప్పారు. హిందీలో పూరీయే దర్శకుడని అన్నారు.
చిట్చాట్ సందర్భంగా పలువురు అభిమానులు మాట్లాడుతూ ఎన్టీఆర్ను చాలా కొత్తగా చూపించారని అన్నారు. కోర్టు సీన్ - దేవుడి పాట - టెంపర్ పాట నచ్చినట్లు ఎక్కువమంది చెప్పారు. మరో 'గబ్బర్సింగ్' అని పలువురు అన్నారు. ఓ అభిమాని మాట్లాడుతూ ఫస్ట్ ఆఫ్లో తారక్ని, సెకండాఫ్లో తారక రామారావుని చూపించారు అని చెప్పారు.
సినిమాలో ఓ డైలాగ్ ప్రస్తావన వచ్చినప్పుడు అటుగాని, ఇటు గాని ఉండేవాళ్లు తనకు నచ్చరని పూరీ అన్నారు. ఏదో ఒక వైపు ఉండేవాళ్లే తనకు నచ్చుతారని చెప్పారు. పోసాని మురళీ కృష్ణ పాత్ర చాలా గొప్పగా రూపొందించినట్లు తెలిపారు.