సిటీ బస్సులపై రాళ్ల వర్షం | city buses glass blast in throwing stones incident in hyderabad | Sakshi
Sakshi News home page

సిటీ బస్సులపై రాళ్ల వర్షం

Oct 10 2015 11:30 AM | Updated on Sep 3 2017 10:44 AM

కొందరు ఆందోళనకారులు రెండు సిటీ బస్సులపై రాళ్లు రువ్వి వాటి అద్దాలు ధ్వంసం చేశారు.

హైదరాబాద్: కొందరు ఆందోళనకారులు రెండు సిటీ బస్సులపై రాళ్లు రువ్వి వాటి అద్దాలు ధ్వంసం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ.. అఖిలపక్షాలు చేపట్టిన బంద్‌లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని డిపోల ఎదుట శాంతీయుతంగా నిరసనలు తెలుపుతున్న విపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, దగ్గర్లో ఉన్న పీఎస్లకు తరలించారు. కాగా.. నగరంలోని ఆబిడ్స్ జీపీఓ వద్ద రెండు సిటీ బస్సులపై కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సుల్లో ఉన్న ఎవరికీ గాయాలు కాలేదు.

 మరో వైపు రాజేంద్రనగర్‌లో ఆందోళన చేపట్టిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లిలో కొందరు ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై రాళు రువ్వారు. ఈ ఘటనలో బసు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement