వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంపై ఆరోపణలు
- గత ఏడాది జూలైలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి
- ఇప్పటికీ పూర్తి ఇండెంట్లు ఇవ్వని వైద్య ఆరోగ్య శాఖ
- టీఎస్‌పీఎస్సీ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోని అధికారులు
- వైద్య ఆరోగ్యశాఖ తీరుపై చీఫ్ సెక్రటరీకి టీఎస్‌పీఎస్సీ నివేదిక!
సాక్షి, హైదరాబాద్: అధికారుల అలసత్వం నిరుద్యోగులపాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 2,118 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసి ఏడాది కావ స్తోంది. అయితే ఇంతవరకు పోస్టుల వారీగా సమ గ్రంగా ఇండెంట్లు, రోస్టర్ పాయింట్లు ఇవ్వడంలో వైద్య ఆరోగ్య శాఖ అలసత్వం కారణంగా అవి భర్తీకాకుండా ఉండిపోయాయి. రూల్ ఆఫ్ రిజ ర్వేషన్, రోస్టర్ పాయింట్లు ఇస్తే తప్ప నోటిఫికే షన్లను జారీ చేసే అవకాశం లేదు. టీఎస్‌పీఎస్సీ ఎన్ని సార్లు వైద్య ఆరోగ్య శాఖను అడిగినా ఇండెంట్లు ఇవ్వక పోవడంతో వాటి భర్తీ ముం దుకు సాగడం లేదు. ఈ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ జాప్యం చేస్తోందంటూ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రచారంపై టీఎస్‌పీఎస్సీ స్పందించింది. పోస్టుల భర్తీ ఎందుకు ఆలస్యం అవుతోందన్న అంశంపై జూన్ 29న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ సమగ్ర నివేదికను అందజేసినట్లు తెలిసింది.
గత ఏడాది ఉత్తర్వులు జారీ అయినా..
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 2,118 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గతేడాది జూలై 13న ఉత్తర్వులు (జీవో 89) జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేయాలని అందులో స్పష్టం చేశారు. ఆయా పోస్టులకు సంబంధిం చిన లోకల్ కేడర్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వివరాలు, అర్హతలతో కూడిన ఇండెంట్లు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. అయితే వాటిని ఇంతవరకు వైద్య ఆరోగ్యశాఖ సమగ్రంగా ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న 2,118 పోస్టుల్లో నుంచి 228 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 7 డెంటల్ సర్జన్ పోస్టు లను తొలగిస్తున్నట్లు పేర్కొం ది. కానీ ఈ విషయాన్ని అధికా రికంగా చెప్పడం లేదు.
ఆ పోస్టులకు రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివరాలను ఇవ్వకుండా, కావాలనే వాటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం లేకుండా చేస్తోందనే ఆరోపణలు ఉన్నా యి. ఇదిలా ఉండగా ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారి కోసమే నోటిఫికేషన్‌ను ఆపు తోందన్న వాదనలూ ఉన్నా యి. అయితే వారికి 30 శాతం వెయిటేజీ ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ సిద్ధమైనా, అసలు రాత పరీక్ష లేకుండా వారికి ఆ పోస్టులను ఇవ్వాలన్న తలంపుతో జాప్యం చేస్తోందన్న ఆరోప ణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
1,844కు పైగా పారామెడికల్ పోస్టులు ఖాళీ...
రాష్ట్ర వ్యాప్తంగా 1,844 పైగా పారా మెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులు 2, రేడియోగ్రాఫర్స్ 35, స్టాఫ్ నర్సు పోస్టులు 1,200, ల్యాబ్æ టెక్నీషియన్ పోస్టులు 200, ఫార్మసిస్టు పోస్టులు 238, ఏఎన్‌ఎంలు 150, ఫిజియోథెరపిస్టు 6, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 6 వరకు ఉన్నాయి.
పోస్టుల భర్తీలో ఆలస్యంపై సీఎం ఆగ్రహం..
వైద్య పోస్టుల భర్తీ వ్యవహారంలో జరుగుతున్న జాప్యం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాదాపు ఏడాది కిందట భర్తీకి ఉత్తర్వులు ఇస్తే ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. నోటిఫికేషన్ల జారీలో ఆలస్యానికి గల కారణాలను టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని సీఎం అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ గత నెల 29వ తేదీన ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు అందజేసినట్లు తెలిసింది.
వివాదం లేని పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!
ఎలాంటి వివాదంలేని 274 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు ఇటీవల అందాయని సీఎస్‌కు అందజేసిన నివేదికలో వాణిప్రసాద్ పేర్కొన్నట్లు తెలిసింది. వాటితోపాటు మరో 215 పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు, వివరణలు వచ్చాయని, వాటికి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.