చర్లపల్లి విమ్టా ల్యాబ్లో అక్రమంగా ఔషధ ప్రయోగాలు చేస్తున్న వైనం పోలీసు తనిఖీలలో బయటపడింది.
చర్లపల్లి విమ్టా ల్యాబ్లో అక్రమంగా ఔషధ ప్రయోగాలు చేస్తున్న వైనం పోలీసు తనిఖీలలో బయటపడింది. మనుషులపై ఔషధ ప్రయోగాలు చేయాలంటే ముందుగా అనుమతి అవసరం అవుతుంది. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, వాళ్లకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ప్రయోగాలు చేస్తే నేరం అవుతుంది.
దాంతో ఇప్పుడు చర్లపల్లి విమ్టా ల్యాబ్స్లో జరుగుతున్న ఔషధ ప్రయోగాలకు సంబంధించిన రికార్డులను కుషాయిగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు మీద విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. పోలీసు స్టేషన్కు రావాలని విమ్టా ల్యాబ్ యజమానులను ఆదేశించారు.