
తలసాని కుమారుడిని ఓటు అడిగిన వసంత యాదవ్
రాంగోపాల్‌పేట్: మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత యాదవ్ ఆదివారం మారేడుపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి... కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు.
మంత్రి ఇంటి ముందే ఉన్న ఆయన కుమారుడు సాయి యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని అందిస్తూ... హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన నవ్వుతూ ‘ఆల్‌ది బెస్ట్’ అంటూ అభినందనలు తెలిపారు.