
‘అందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటన’
సిద్దిపేట : నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ పయనమయ్యారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తన బ్లాక్మనీపై ప్రధాని మోదీతో రాయబారం నడిపిస్తున్నారన్నారు.
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి నోట్ల రద్దుతో నష్టం లేనట్లు... కేవలం కేసీఆర్కే ఇబ్బందులున్నట్లు మోదీతో భేటీయ్యారని విమర్శించారు. నోట్ల రద్దు చేయాలన్నా, ఇతర మార్పులు ఏమైనా ఉంటే స్వయంప్రతిపత్తి గల ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించాల్సి ఉండగా, ప్రధానమంత్రి నోట్ల రద్దు చేయడం అప్రజాస్వామికమన్నారు. దీనిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు.