
'సెలవుల్లోనూ కోర్టులు పనిచేసేలా చర్యలు'
పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో కోర్టుల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో కోర్టుల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. న్యాయ సంస్కరణలపై ఆదివారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.
పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలుగా కొత్త కోర్టుల ఏర్పాటుకు కేసీఆర్ సహకరిస్తారని చెప్పారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి కావల్సిన మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని వివరించారు. పెండింగ్ కేసుల పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటతడి పెట్టడం మనసును కలచి వేసిందన్నారు.